- Telugu News Photo Gallery Summer tour special enjoy these special hill stations located in the neighborhood of chandigarh
Summer Tour: వేసవిలో టూర్‌కి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారా.. చండీగఢ్ పరిసరాల్లోని ఈ హిల్‌స్టేషన్లు సూపర్..!
Summer Tour: చండీగఢ్ చాలా అందమైన నగరం. ఇక్కడ నివసించడానికి చాలామంది ఇష్టపడుతారు. ఈ నగరం పరిసరాల్లో కొన్ని అందమైన హిల్ స్టేషన్లు ఉన్నాయి.
Updated on: May 03, 2022 | 11:13 AM

చండీగఢ్ చాలా అందమైన నగరం. ఇక్కడ నివసించడానికి చాలామంది ఇష్టపడుతారు. ఈ నగరం పరిసరాల్లో కొన్ని అందమైన హిల్ స్టేషన్లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

మోర్ని హిల్స్ స్టేషన్ చండీగఢ్ నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నుంచి వెళ్లడానికి మీకు 1.5 గంటలు పట్టవచ్చు. మీరు ట్రెక్కింగ్, జిప్ లైనింగ్, రాక్ క్లైంబింగ్ వంటివి ఆస్వాదించవచ్చు. అంతే కాకుండా అనేక మతపరమైన ప్రదేశాలు కూడా ఈ ప్రదేశానికి గర్వకారణం.

సిమ్లా పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశం. ఇక్కడ మీరు జఖూ టెంపుల్, వైస్రెగల్ లాడ్జ్, చాడ్విక్ జలపాతం, గ్రీన్ వ్యాలీ వంటి అందమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. ఇది చండీగఢ్ నుంచి112 కి.మీ దూరంలో ఉంటుంది. మీరు దాదాపు 3 గంటల్లో ఆ ప్రదేశానికి చేరుకోవచ్చు.

చండీగఢ్ వెళ్లే వారికి కసౌలీ ఉత్తమ ఎంపిక. పర్యాటకులు కూడా సరదాగా గడిపేందుకు వెళుతుంటారు. ఇది చండీగఢ్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి మీకు దాదాపు 2 గంటల సమయం పడుతుంది.

పర్వానూ హిల్ స్టేషన్ చండీగఢ్ నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు కేవలం ఒక గంటలో ఇక్కడికి చేరుకోవచ్చు. మతపరమైన ప్రదేశాలపై ఆసక్తి ఉన్నవారు ఇక్కడ చాలా ప్రదేశాలని చూడవచ్చు.



