Hyderabad: గణేష్‌ నిమజ్జనాల ఎఫెక్ట్.. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు! ఎప్పటి వరకంటే?

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలు మొదలయ్యే సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఆగస్ట్‌ 29 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు.

Hyderabad: గణేష్‌ నిమజ్జనాల ఎఫెక్ట్.. ఆ ప్రాంతాల్లో  ట్రాఫిక్ ఆంక్షలు! ఎప్పటి వరకంటే?
Traffic Restrictions

Updated on: Aug 31, 2025 | 4:44 PM

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలు మొదలయ్యే సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.ఇందులో భాగంగానే సెప్టెంబర్‌ 5 వరకు నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. ఈ ఆంక్షలు ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి అర్ధరాత్రి వరకు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా ట్యాంక్‌ బండ్‌కు విగ్రహాలు వస్తాయి కాబట్టి ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గ్ ప్రాంతాల్లో భారీగా వాహనాల రాకపోకలు ఉండే అవకాశం ఉన్నందున ఇతర వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.

ఆంక్షలు విధించిన రూట్లు ఇవే..

ముఖ్యంగా సెయిలింగ్ క్లబ్ జంక్షన్, వీవీ విగ్రహం, తెలుగు తల్లి జంక్షన్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ ఎక్స్ రోడ్, నల్లగుట్ట బ్రిడ్జి, బుద్ధభవన్ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్టు పోలీసులు తెలిపారు. దీనితో పాటు అప్పర్ ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ మీద ఆంక్షలు ఉండవచ్చు. అయితే లిబర్టీ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, పంజాగుట్ట వైపు నుంచి వచ్చే వాహనాలు కవాడిగూడ, బేగంపేట్, మినిస్టర్ రోడ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళాలని సూచించారు.

వాహనదారులకు సూచనలు

అయితే నిమజ్జన సమయాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు వాహనదారులు ట్రాఫిక్ రూల్స్‌ పాటించాలని పోలీసులు సూచించారు. ఎక్కువగా రద్దీ ఉన్న సమయంలో వాహనాలు తీసుకెళ్లేప్పుడు ఆంక్షలను పాటించాలని తెలిపారు. ప్రజలు గణేష్ నిమజ్జన ప్రాంతాలకు వెళ్లేటప్పుడు… ప్రైవేటు వాహనాలను తీసుకురాకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.