Hyderabad: ఆమె దర్జాగా ఇంట్లోకి దూరింది.. షూ ర్యాక్‌లో తాళాలు తీసింది.. చివరికి సీన్ ఇది

షూ ర్యాక్‌లో తాళాలు ఉన్నాయ్. అవి తీసుకుని వెంటనే ఇంటిలోకి వెళ్లింది. ఇంట్లో దొరికినవి దోచుకుంది.. తీరా సీసీటీవీ ఫుటేజ్ చూడగా.. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి మీరూ లుక్కేయండి మరి.

Hyderabad: ఆమె దర్జాగా ఇంట్లోకి దూరింది.. షూ ర్యాక్‌లో తాళాలు తీసింది.. చివరికి సీన్ ఇది
Shoe Rack

Edited By:

Updated on: Jul 26, 2025 | 1:19 PM

హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీసులు చోరీ ఆరోపణలపై శుక్రవారం 21 ఏళ్ల యువతిని అరెస్ట్ చేశారు. బాబీ అలియాస్ ఆరోహి అనే ఈ యువతి రూ.2.21 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించిన కేసులో పట్టుబడింది. ఆమె ప్రజంట్ సనత్‌నగర్‌లోని మధురనగర్‌లో నివసిస్తోంది. ఆమె సొంత ఊరు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌గా పోలీసులు గుర్తించారు.

జూలై 18న అల్విన్ కాలనీలోని ఓ ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులు తెలిపారు. ఇంటి ముందు షూ ర్యాక్‌లో ఉంచిన కీస్ తీసుకుని లోపలికి ప్రవేశించిన ఆమె.. బెడ్‌రూంలోని అలమారాలో ఉన్న 22.3 తులాల బంగారు ఆభరణాలు.. 5 తులాల వెండి ఆర్నమెంట్స్ దొంగిలించింది. సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళను గుర్తించిన పోలీసులు.. ఆమెపై గతంలో బోరబండ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆమెను సనత్‌నగర్‌లోని ఇంటి వద్ద అరెస్ట్ చేశారు.

పోలీసుల విచారణలో ఆమె డోర్ టూ డోర్ సేల్స్ పర్సన్‌గా పనిచేస్తోందని.. చాలా ఇంట్లో తాళాలు షూ ర్యాక్, బకెట్లలో, పూల కుండీలలో ఉంచినట్లు గమనించినట్లు చెప్పింది. ఆదాయం తక్కువగా ఉండటంతో దొంగతనాలు చేయడం ప్రారంభించినట్లు అంగీకరించింది. ఈ ఘటనపై BNS సెక్షన్ 305 ప్రకారం కేసు నమోదు చేసి పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..