Hyderabad Rains: హైదరాబాద్‌కు అలెర్ట్.. కాసేపట్లో భారీ వర్షం…

|

May 12, 2024 | 5:01 PM

హైదరాబాద్‌కు డేంజర్‌ వార్నింగ్‌ ఇస్తోంది వాతావరణశాఖ. మరో రెండు మూడు గంటల్లో కుండపోత వర్షం కురుస్తుందని హెచ్చరిక జారీ చేసింది. రాబోయే కొద్ది గంటల్లో హైదరాబాద్‌కి భారీ వర్షాల ముప్పు పొంచివుందన్న హెచ్చరికలు జనం గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి. బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

Hyderabad Rains: హైదరాబాద్‌కు అలెర్ట్.. కాసేపట్లో భారీ వర్షం...
Rain Alert
Follow us on

హైదరాబాద్ నగరంలో మే 12, ఆదివారం సాయంత్రం, రాత్రి వేళల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. వర్షం వల్ల సమస్యలు తలెత్తితే, సహాయం కోసం డీఆర్ఎఫ్ నెంబర్లు 040-21111111, 9000113667 సంప్రదించాలని సూచించారు. భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తం అయింది. డీఆర్ఎఫ్‌ బృందాలను రెడీ చేసింది. వాటర్‌ లాకింగ్‌ పాయింట్స్‌ దగ్గర సిబ్బందిని కేటాయించింది.

కాగా..  తెలంగాణలో పోలింగ్ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పోలింగ్ రోజు మే 13న రాష్ట్రం మొత్తం వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మాములుగా హైదరాబాద్ నగరంలో పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉంటోంది. ఇక వర్షం ఉంటే.. పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉంది. ప్రజలందరూ బెటర్ ఫ్యూచర్ కోసం ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా యువత పోలింగ్ డేను ఓ హాలిడే మాదిరిగా చూడకుండా.. ఓటు వేసేందుకు కదిలి రావాలంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…