Hyderabad: మీ పిల్లలు చాక్లెట్లు, బిస్కెట్లు తింటున్నారా!.. తస్మాత జాగ్రత్త

|

Feb 28, 2023 | 8:25 PM

ఇది కల్తీ కాలం. అదీ ఇదీ అని కాదు. అన్ని ప్రొడక్ట్స్ కల్తీనే. పల్లెటూరల్లో కొద్దో, గొప్పో నయం. సిటీల్లో అయితే చివరికి వాటర్ కూడా కల్తీనే. కేటుగాళ్లు తెగబడిపోతున్నారు.

Hyderabad: మీ పిల్లలు చాక్లెట్లు, బిస్కెట్లు తింటున్నారా!.. తస్మాత జాగ్రత్త
Chocolates
Follow us on

— మీ పిల్లలు తింటున్న చాక్లెట్లు, బిస్కెట్లు తింటున్నారా! అవి మంచివా? కాలం చెల్లినవా? ఈ ప్రశ్న ఎందుకంటే హైదరాబాద్ బోడుప్పల్‌లో రీసైక్లింగ్ ముఠా దొరికింది. వాళ్ల పని ఎక్స్‌పైరీ అయిన వస్తువలకు డేట్లు మార్చేయడం. మళ్లీ మార్కెట్‌లోకి వదులడం. ఆ జాబితాలో చిన్నపిల్లలు తినే బిస్కెట్లు, చాక్లెట్లు,చిప్స్‌, లాలీపాప్స్‌ కూడా ఉన్నాయి.

— ఫుడ్‌ ఐటమ్స్‌ విషయంలో ఎక్స్‌పైరీ డేట్‌ చాలా ముఖ్యం. తేడావస్తే ఫుడ్ పాయిజన్‌ జరిగే ప్రమాదం ఉంది. కానీ రీసైక్లింగ్‌ ముఠా అవేమీ పట్టించుకోవడం లేదు. సబ్బులు, షాంపులు, కాస్మొటిక్స్‌ సైతం డేట్లు మార్చేసి, ఫ్రెష్‌ ప్రొడక్ట్స్‌గా మార్కెటింగ్‌ చేస్తున్నారు.

— కోఠిలోని హరిహంత్ కార్పొరేషన్ కార్యాలయంలో పోలీసులు సోదాలు చేశారు. బోడుప్పల్‌ గోదాముల్లో తనిఖీలు నిర్వహించారు. కోట్లు విలువ చేసే ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 300 రకాల వస్తువులను ముఠా రీసైక్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం