Hyderabad: చైన్​స్నాచింగ్​లో సెంచరీ కొట్టిన ఉమేష్ ఖతిక్‌ను ఎవరు విచారించాలి.. ఎక్కడ రిమాండ్ చేయాలి

|

Jan 23, 2022 | 1:35 PM

హైదరాబాద్‌లో చోరీలు చేయడానికి వచ్చిన ఉమేష్ ఖతిక్ నాంపల్లిలోని ఓ లాడ్జీలో గది అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఓ స్కూటీని దొంగతనం చేసి వరుసగా చోరీలకు పాల్పడ్డాడు.

Hyderabad: చైన్​స్నాచింగ్​లో సెంచరీ కొట్టిన ఉమేష్ ఖతిక్‌ను ఎవరు విచారించాలి.. ఎక్కడ రిమాండ్ చేయాలి
Chain Snatcher Umesh Kathik
Follow us on

Chain Snatcher :హైదరాబాద్‌లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఉమేష్ ఖతిక్(Umesh Kathik) ఎట్టకేలకు దొరికాడు. కానీ ఇప్పుడు ఎవరు విచారించాలి.. ఎక్కడ రిమాండ్ చేయాలనేది సస్పెన్స్‌గా మారింది. చూడటానికి స్మార్ట్‌గా.. సాప్ట్ వేర్ ఎంప్లాయ్ లాగా కనిపించే.. ఈ ఉమేష్ ఖతిక్.. నయా కేటుగాడు. పక్కనే ఉంటూ.. మన పక్కనే అమాయకంగా తిరుగుతూ.. అడ్డంగా దోచుకెళ్లడం ఇతని నైజం. మూడు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్. ఎందుకంటే ఇతగాడు చేసిన చోరీల హిస్టరీ అలాంటిది మరీ. రాజస్థాన్‍‌కు చెందిన ఉమేష్ ఖతిక్ అనే కేటుగాడిని అహ్మదాబాద్‌లో అరెస్టు చేశారు పోలీసులు. కానీ ఇతనిపై గుజరాత్‌తో పాటు మహారాష్ట్ర, తెలంగాణలో పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. దీంతో ఇతని ఇన్వెస్టిగేషన్ కోసం ఆయా రాష్ట్రాల పోలీసుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్‌లో చోరీలు చేయడానికి వచ్చిన ఉమేష్ ఖతిక్ నాంపల్లిలోని ఓ లాడ్జీలో గది అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఓ స్కూటీని దొంగతనం చేసి వరుసగా చోరీలకు పాల్పడ్డాడు. ఈ ఘటనలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూడు కమిషనరేట్ల పోలీసులు అసిఫ్ నగర్, జియాగూడ, నాంపల్లిలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితుడు నాంపల్లిలోని లాడ్జిలో బస చేసినట్లు గుర్తించి లాడ్జి నిర్వాహకుల నుంచి అతడి వివరాలను సేకరించారు. ఉమేశ్ అహ్మదాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లారు. అతడిని చాకచక్యంగా అరెస్ట్ చేయడంతో ఈ కేసు రెండ్రోజుల్లోనే ముగింపుకొచ్చింది. అన్ని ప్రక్రియలు పూర్తిచేసి నిందితుడిని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.

చైన్ స్నాచర్‌పై గుజరాత్, మహారాష్ట్రలోనూ పదుల సంఖ్యలో చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఉమేష్ ఖతిక్ .. మరో నిందితుడు దీపక్ తో కలిసి గుజరాత్ లో నేరాలకు పాల్పడుతూ 2015 లో తొలిసారిగా అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్ ను టార్గెట్ చేసుకుని ఈ నెల 18న నాంపల్లి వచ్చాడు. మధ్యాహ్నం 2గంటలకు నాంపల్లిలోని మేజిస్టిక్ హోటల్ కు వచ్చాడు. హోటల్ లో 204 రూమ్ లో దిగాడు. రాత్రంతా హోటల్లోనే ఉండి.. మరుసటి రోజు 19వ తారీఖున ఉదయం 9గంటలకు బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి బయలుదేరి వరుస స్నాచింగ్ లకు పాల్పడ్డాడు. సాయంత్రం 6 గంటలకు మళ్లీ హోటల్ కు చేరుకుని రూం వేకెట్ చేసి వెళ్లిపోయాడు.

కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజ్ తో పాటు.. హోటల్‌లో అతను సబ్మిట్ చేసిన ఐడి ఫ్రూఫ్, ఫోన్ నెంబర్ సాయంతో అహ్మదాబాద్‌లో అరెస్టు చేశారు పోలీసులు. హోటల్ రికార్డులో ముంబై నుంచి వచ్చిన ఉమేష్‌గా నమోదై ఉంది. ఈ నెల 19 నుంచి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. చివరగా రాచకొండ మేడిపల్లి సంపూర్ణ హోటల్ సమీపంలో స్కూటీని వదిలి వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. వెస్ట్ జోన్ లోని ఆసిఫ్ నగర్ లో స్కూటీ దొంగతనం చేశాడు. చోరీలు చేసిన లింక్ సీసీ ఫుటేజ్‌ను అయా జిల్లాల పోలీసులకు పంపించారు అధికారులు. మేడిపల్లిలో బస్సు ఎక్కి వరంగల్ వైపు వెళ్లినట్లు అనుమానించిన పోలీసులు….టెక్నికల్‌ ఎవిడెన్స్‌తో ఉమేష్‌ ఖతిక్‌ను అహ్మదాబాద్‌లో అరెస్టు చేశారు.

Also Read:  విషాదం.. బైక్‌పై వెళ్తుండగా, తల్లి చేతుల్లో నుంచి జారిపడ్డ 3 నెలల పసివాడు.. చక్రంలో ఇరుక్కుని

Vizianagaram District: మైనర్లు, మహా ముదుర్లు.. మహిళలు పూలకు వెళ్లటం చూసి..