Hyderabad Police: హైదరాబాద్ పోలీసులతోనే ఆటలా.. గంటల వ్యవధిలోనే చైన్ స్నాచర్ అరెస్ట్..

|

Jan 22, 2022 | 1:58 PM

Chain Snatcher Arrest: హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం హడలెత్తించిన చైన్ స్నాచర్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో

Hyderabad Police: హైదరాబాద్ పోలీసులతోనే ఆటలా.. గంటల వ్యవధిలోనే చైన్ స్నాచర్ అరెస్ట్..
Chain Snatcher
Follow us on

Chain Snatcher Arrest: హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం హడలెత్తించిన చైన్ స్నాచర్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చైన్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 19న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిల్లో అంతర్రాష్ట్ర దొంగ పలువురు మహిళల నుంచి గొలుసులను లాక్కెళ్లాడు. అనంతరం దొంగతనం చేసి తీసుకొచ్చిన స్కూటీని వదిలి వెళ్లాడు. వెంటనే రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు.. సీసీ కెమెరాల సాయంతో చైన్ స్నాచర్ కదలికలను పసిగట్టారు. కేవలం రెండు రోజుల్లోనే చైన్ స్నాచర్‌ను అరెస్టు చేశారు. చైన్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ ను శనివారం అహ్మదాబాద్లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు గుజరాత్ వెళ్లిన హైదరాబాద్ పోలీసుల బృందం నేరస్థుడిని అహ్మదాబాద్లో అదుపులోకి తీసుకుంది.

చోరీ చేయడానికి వచ్చిన ఉమేష్ ఖతిక్ నాంపల్లిలోని ఓ లాడ్జ్ లో గది అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఓ స్కూటీని దొంగతనం చేసి.. వరుసగా చోరీలకు పాల్పడ్డాడు. చైన్ స్నాచింగ్స్ జరిగిన తర్వాత అసిఫ్ నగర్, జియాగూడ, నాంపల్లిలోని సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. నాంపల్లిలోని లాడ్జిలో ఉమేష్ ఖతిక్ బస చేసినట్లు గుర్తించి లాడ్జి నిర్వాహకుల నుంచి ఉమేష్ వివరాలను సేకరించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఉమేశ్ అహ్మదాబాద్ లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకొని అరెస్ట్ చేశారు. ఈ నేరస్థుడిని హైదరాబాద్‌కు తీసుకువస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Hyderabad: కొట్టెసిన స్కూటీతో దర్జాగా దొంగతనాలు చేసి చెక్కేశాడు.. మరి పోలీసులు ఏం చేస్తున్నారంటే..

Hyderabad: శంషాబాద్ విమానశ్రయంలో భారీగా పట్టివేత.. ఎవరికీ అనుమానం రాకుండా..