Food Poison: ఉస్మానియా మెడికల్ కాలేజీలో 56 మందికి వైద్య విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స..

Food Poison: ఉస్మానియా మెడికల్ కాలేజీలో 56 మంది వైద్య విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం..

Food Poison: ఉస్మానియా మెడికల్ కాలేజీలో 56 మందికి వైద్య విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స..
Osmania Hospital

Updated on: Mar 16, 2021 | 11:08 AM

Food Poison: ఉస్మానియా మెడికల్ కాలేజీలో 56 మంది వైద్య విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న ప్రిన్సిపల్ అస్వస్థతకు గురైన వైద్య విద్యార్థులను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాలేజీ హాస్టల్‌లో భోజనం చేసిన తరువాత విద్యార్థులకు వాంతులు, విరోచనాలు మొదలైనట్లు చెబుతున్నారు. ఫుడ్, పెరుగు బాగాలేకపోవడం వల్లే అస్వస్థతకు గురయ్యామని బాధిత విద్యార్థులు చెబుతున్నారు.

మొత్తం 56 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, 20 మంది పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు విద్యార్థుల బంధువులు అంటున్నారు. అయితే విద్యార్థులకు వంట చేసే టీమ్‌లో ఇద్దరికి డయేరియా రావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రం నుంచే విద్యార్థులకు అస్వస్థత మొదలైందని విద్యార్థులు తెలిపారు. కాగా, ప్రస్తుతం విద్యార్థులందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు.

Also read:

CID Notice: అమరావతి భూముల కుంభకోణం.. చంద్రబాబుకు సీఐడీ నోటీసులు.. టీవీ9 చేతికి కీలక నివేదిక.. Live Updates

ప్రారంభమైన తెలంగాణ శాసనసభ, శాసన మండలి.. ఈరోజు సభలో పలువురి సంతాప తీర్మానాలతో సరి..