Hyderabad: నగర అభివృద్ది దిశగా నూతన నిర్మాణాలు.. అక్రమ కబ్జాలు, నాలాలపై ఆస్తుల కూలగొట్టడానికి కేటీఆర్ ఆదేశాలు జారీ

|

Oct 11, 2022 | 8:53 PM

భాగ్య నగరం విస్తరణ ప్రణాళికలో భాగంగా నగర వాసుల ఆట విడుపు కోసం పార్క్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొత్వాల్ గూడ లో 125 ఎకరాల్లో కూడా ఎకో పార్క్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు

Hyderabad: నగర అభివృద్ది దిశగా నూతన నిర్మాణాలు.. అక్రమ కబ్జాలు, నాలాలపై ఆస్తుల కూలగొట్టడానికి కేటీఆర్ ఆదేశాలు జారీ
Ktr On Hyderabad 4
Follow us on

హైదరాబాద్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని.. పెట్టుబడులకు కేంద్రంగా చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ దేశంలో అత్యంత అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి అని చెప్పారు. నగరం అన్నీ రంగాల్లో పెట్టుబడులకు అయస్కాంతం అని చెప్పారు. తన స్కూల్ డేస్ సమయంలో గండి పేట పార్క్ తో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆనాడు వరద నివారణ, మంచినీటి కోసం జంట జలాశయాలు కట్టారన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో 2050 వరకు ఈ జలాశయాల అవసరం లేకుండానే మంచినీటి అందించేలా కృష్ణా గోదావరి వాటర్ తెస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్ కోసం నగరంలో ఎన్నో నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు కేటీఆర్.

Ktr On Hyderabad

భాగ్య నగరం విస్తరణ ప్రణాళికలో భాగంగా నగర వాసుల ఆట విడుపు కోసం పార్క్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొత్వాల్ గూడ లో 125 ఎకరాల్లో కూడా ఎకో పార్క్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నీటిలో నడిచే అనుభూతి ఉండేలా హిమాయత్ సాగర్ పై  దేశంలోనే అతి పెద్ద ఎక్వేరియం ఎకో పార్క్ ను ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు కేటీఆర్. ఇందులోనే అతి పెద్ద పక్షుల ప్లేస్ ని కూడా వస్తుందన్నారు.

Ktr On Hyderabad

111 జీఓ ఎత్తేయడంతో జంట జలాశయాలు కలుషితం అవుతాయని ప్రచారం చేస్తున్నారు.  అలా కాకుండా అవసరం అయితే STP లు ఏర్పాటు చేస్తాం .. ఈ జంట జలాశయాలు సురక్షితంగా ఉండేలా చూసే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. 84 గ్రామాల్లో అందరి కోరిక మేరకే మంచి ఆలోచనతో సీఎం 111 జీఓ ఎత్తేశారని చెప్పారు మంత్రి కేటీఆర్.

ఇవి కూడా చదవండి

Ktr On Hyderabad

జంట జలాశయాలకు నీరు తెచ్చే బుల్కా పూర్ నాలా, ఫిరంగి నాలా మీద ఉన్న కబ్జాలను తొలగించాలని అధికారు లకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు మంత్రి కేటీఆర్. నగరంలో ఆక్రమణ లను తొలగింపును ఎవరు అడ్డుకోవద్దని చెప్పారు. అంతేకాదు నగరంలో నాలాలపై ఎవరి ఆస్తులు ఉన్నా కులగొట్టమని చెప్పారు. అయితే ఈ సమయంలో  స్థానిక నేతలు అడ్డు రావొద్దని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..