నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నప్పటికి కూడా తెలంగాణలో కరోనా మహమ్మారి అదుపులోకి రాలేదు. దీంతో రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కేవలం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్నింటికి అనుమతి ఇవ్వనున్నారు. ఆ తర్వాత అత్యవసరాలకు మాత్రమే అనుమతి. లాక్ డౌన్ దృష్ట్యా, హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల సమయంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు రీషెడ్యూల్ సమయాన్ని హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ అనౌన్స్ చేసింది. లాక్ డౌన్ కాలంలో ఫస్ట్ ట్రైన్ టెర్మినల్ స్టేషన్ల నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరనుంది. లాస్ట్ ట్రైన్ ఉదయం 8:45 నిమిషాలకు మొదలు కానుంది. ఈ రైలు ఉదయం 9:45 గంటల కల్లా సంబంధిత చివరి టెర్మినేషన్ స్టేషన్‌కు చేరుకుంటుంది. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల మధ్యలో మాత్రమే మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయి
మహమ్మారి వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి భద్రత కోసం, ప్రయాణికులు భౌతిక దూరం పాటించడం, ఫేస్ మాస్క్‌లు ధరించడం, క్రమంగా హ్యాండ్ శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ వంటి కరోనా భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని మెట్రో రైలు సంస్థ కోరింది. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని సేఫ్ గా ఉంచే ప్రయత్నాలలో భద్రతా సిబ్బంది, హైదరాబాద్ మెట్రో రైలు సిబ్బందితో సహకరించాలని సూచించారు.
#ManaMetro #MyMetroMyPride #HyderabadMetro pic.twitter.com/MMlxIONySn
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) May 11, 2021
Also Read: తెలంగాణలో మరికొద్ది గంటల్లో అమల్లోకి లాక్‌డౌన్.. వేటికి అనుమతి ఉంటుంది.. వేటికి ఉండదు..?