హైదరాబాద్ మహానగరం గణేశ్ నిమజ్జనోత్సవానికి ముస్తాబైంది. పార్వతీ తనయుడు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. శనివారం రాత్రి నుంచే ట్యాంక్‌బండ్ పరిసరాలు సందడిగా మారాయి. ఈ నేపథ్యంలో నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ఇప్పటికే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా.. మెట్రో రైల్ సైతం సర్వీసులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. గణేష్ నిమజ్జనం దృష్టా ఆదివారం అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో రైల్ అధికారులు వెల్లడించారు.
ఆదివారం గణేష్ నిమజ్జనం దృష్టా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు అందించనుంది. ఇవాళ(ఆదివారం) అర్థరాత్రి రెండు గంటల వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో మెట్రో రైళ్ల సమయం పొడిగించారు. అంతేగాక ఈ అర్థరాత్రి నుంచి అంతరాష్ట్ర వాహనాల ప్రవేశంపై పోలీసులు నిషేధం విధించారు. అదే విధంగా పలుచోట్ల ఆర్టీసీ బస్సులను దారి మళ్లించనున్నారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు ప్రత్యేక మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
Like every year, Khairatabad will be lit up with the spirit of Ganesh Visarjan. Leave your cars at home and take the #HyderabadMetroRail to be a part of the celebrations. #HyderabadMetro will run till 1:00 AM of 20th September. It’s time to bid adieu to Ganpati Bappa! pic.twitter.com/qobjI3O3Lb
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) September 18, 2021
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
చాంద్రాయణగుట్ట, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, మొజంజాహీ మార్కెట్, ఆబిడ్స్, బషీర్‌బాగ్ లిబర్టీ, హుస్సేన్ సాగర్ వరకూ ఉన్న మార్గంలో విగ్రహాలు తీసుకొస్తున్న వాహనాలు మినహా ఇతర వాహనాలు అటూ, ఇటూ వెళ్లేందుకు అనుమతి లేదు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సమీపంలోని బషీర్‌బాగ్ ఫ్లై ఓవర్ కింద మాత్రమే వాహనాలు, ప్రజలను అటూ, ఇటూ అనుమతించనున్నారు. ఆయా ప్రాంతాల్లోని ఆసుపత్రులకు వచ్చే అంబులెన్స్‌లు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు మాత్రం ట్రాఫిక్ పోలీసులు మినహాయింపు ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Khairatabad Ganesh Nimajjanam: ట్యాంక్‌బండ్ వైపు కదులుతున్న మహా గణపతి.. సందడిగా మొదలైన శోభాయత్ర..
Ganesh Nimajjanam: మహానగరంలో మహోత్సవం.. ట్యాంక్‌బండ్ వైపు కదులుతున్న గణనాథులు
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ చూడండి..
బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ చూడండి..