Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వారి కోసం ప్రత్యేక సదుపాయాలు
నగరంలో ట్రాఫిక్ బాధల నుంచి విముక్తి కలిగించేందుకు నిర్మితమైన మెట్రో(Hyderabad Metro).. ప్రయాణికులకు విశేషమైన సేవలు అందిస్తోంది. వివిధ రకాల ఆఫర్లతో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో....
నగరంలో ట్రాఫిక్ బాధల నుంచి విముక్తి కలిగించేందుకు నిర్మితమైన మెట్రో(Hyderabad Metro).. ప్రయాణికులకు విశేషమైన సేవలు అందిస్తోంది. వివిధ రకాల ఆఫర్లతో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో మెట్రో వాసులకు మరో వెసులుబాటు అందుబాటులోకి రానుంది. మెట్రో రైలు దిగగానే గమ్యస్థానానికి చేరుకునేందుకు ప్రయాణికులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మెట్రో దిగగానే ఎలక్ట్రిక్ ఆటోలు(E-Auto) అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకంగా మెట్రో రైలుస్టేషన్ల కేంద్రంగా ఈ ఆటోలు తిరగనున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరులో ఈ తరహా సేవలు విజయవంతంగా అందిస్తున్న ఎలక్ట్రికల్ మొబిలిటీ అంకుర సంస్థ మెట్రోరైడ్.. ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చింది. సోమవారం ఈ-ఆటో సేవలు అధికారికంగా ప్రారంభించనుంది. ఈ-ఆటో కావాలనుకున్న ప్రయాణికులు మెట్రోరైడ్ యాప్ ద్వారా ఆటోలను బుక్ చేసుకోవాలి. బెంగళూరులో గతేడాది ప్రారంభించినప్పుడు మొదటి కిలోమీటరుకు రూ.10, తర్వాత కి.మీకు రూ.5 చొప్పున వసూలు చేశారు. హైదరాబాద్‌లో ఛార్జీలు ఎలా ఉంటాయనేది ప్రారంభ కార్యక్రమంలో వెల్లడించే అవకాశం ఉంది.
‘మెట్రోరైడ్’ స్మార్ట్‌ఫోన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అవసరమైనప్పుడు ప్రయాణాన్ని బుక్ చేసుకోవాలి. వికీ అనే పేరుతో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ వ్యవస్థ ఆధారంగా ఇది పని చేస్తుంది. ఇంటికి దగ్గరగా ఉండే మెట్రోరైడ్ పార్కింగ్ వద్దకు వెళితే చాలు.. ఎలక్ట్రిక్ ఆటో మిమ్మల్ని మెట్రోస్టేషన్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంటుంది. ఇలా ఇళ్లు, ఆఫీసులు అనే కాదు స్కూళ్లు, కాలేజీలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాలకు సులువుగా వెళ్లొచ్చేందుకు వీలుంటుంది. అంతేకాదు ఒకవేళ మహిళా ప్రయాణికులైతే.. మహిళా డ్రైవర్ నడిపే ఆటోను అందుబాటులోకి తెస్తుంది. మెట్రోరైడ్ ఆటోడ్రైవర్లలో 20 శాతం మంది మహిళలు ఉండటం గమనార్హం.
Also Read
Prabhas: ఆ కారు ప్రభాస్‌ది కాదట.. క్లారిటీ ఇచ్చిన రెబల్ స్టార్ పీఆర్ టీమ్.. అసలేమైందంటే..?
Telangana: తెలంగాణ పేరు వింటేనే భగ్గుమంటున్న కేంద్రం.. కమిషనర్ లేఖకు స్పందిస్తుందా..?
Rahul Gandhi Tour: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారు.. మే 6న వరంగల్‌లో రైతు సంఘర్షణ సభకు హాజరు!