Rahul Gandhi Tour: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారు.. మే 6న వరంగల్‌లో రైతు సంఘర్షణ సభకు హాజరు!

ఐదు లక్షల మందితో రాహుల్‌ గాంధీ సభ నిర్వహించి తెలంగాణలో కాంగ్రెస్‌ జవసత్వాలు గట్టిగా ఉన్నాయని చాటాలన్నది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్లాన్‌. ఇందుకోసం భేదాభిప్రాయాలు పక్కనబెట్టి కాంగ్రెస్ పెద్దలందరూ ఏకమయ్యారు.

Rahul Gandhi Tour: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారు..  మే 6న వరంగల్‌లో రైతు సంఘర్షణ సభకు హాజరు!
Rahul Gandhi
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 16, 2022 | 8:53 PM

Rahul Gandhi Telangana Tour: ఐదు లక్షల మందితో రాహుల్‌ గాంధీ సభ నిర్వహించి తెలంగాణలో కాంగ్రెస్‌ జవసత్వాలు గట్టిగా ఉన్నాయని చాటాలన్నది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్లాన్‌. ఇందుకోసం భేదాభిప్రాయాలు పక్కనబెట్టి కాంగ్రెస్ పెద్దలందరూ ఏకమయ్యారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్య ఠాగూర్ అందరితో కలిసి ఓ మీటింగ్‌ కూడా నిర్వహించారు. ఇందులో వరంగల్ సభ టార్గెట్‌తో పాటు.. టైమ్‌ సెన్స్‌పై వార్నింగ్‌లూ కనిపించాయి.

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో తాపత్రయపడుతున్న రాహుల్‌ గాంధీ సభకు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్సైంది. మే 6న ఆయనతో రైతు సంఘర్షణ సభ ఏర్పాటు చేయడం ఒక షెడ్యూల్ అయితే.. తెలంగాణలో కాంగ్రెస్‌ ఎంత గట్టిగా ఉందో చాటిచెప్పేందుకు ఆ సభను వాడుకోవాలన్నది మరో టార్గెట్‌. ఐదు లక్షల మంది జనాన్ని సమీకరించి రాహుల్ సభలో కూర్చోబెట్టాలన్నది టీపీసీసీ ప్రయత్నం. ఈ మీటింగ్‌ విజయవంతం అయితే ఓకే, పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుంది. ఒకవేళ అదే తేడా వచ్చిందటే నష్టం కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. 6న సభ తర్వాత 7న రాహుల్‌ గాంధీ నిర్వహించే రాష్ట్ర, జిల్లా, నియోజక వర్గాల స్థాయి నేతల మీటింగ్‌లో పరిణామాలూ తీవ్రంగానే ఉండే చాన్స్ ఉంది. అందుకే ఇంత భారీ టార్గెట్‌ను ఓ ప్రాజెక్ట్‌గా టేకప్ చేసిన కాంగ్రెస్ పెద్దలు.. పార్టీ ఇంచార్జ్‌ మాణిక్కం ఠాగూర్ నేతృత్వంలో కూలంకశంగా చర్చించారు.

రాహుల్.. రాష్ట్రానికి రావాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇంద్రవెల్లిలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు, ఆ తర్వాత నిరుద్యోగ జంగ్‌ సైరన్‌కు రావాలని కోరినా ఆయన బిజీతో కుదరలేదు. మొన్నామధ్య టీపీసీసీ నేతలంతా ఢిల్లీకి వెళ్లి రాహుల్‌ పర్యటన అవసరం ఏంటో చెప్పుకొచ్చారు. ఏఐసీసీ ఆఫీస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంత మేలో రెండురోజుల పర్యటన ఖరారైంది

టైమింగ్ కలిసి రావాలంటే టైమ్ చాలా ఇంపార్టెంట్‌. అందుకే కొందరు నేతలకు మాణిక్కం ఠాగూర్ సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చారు. ఉదయం 11గంటలకు మీటింగ్ అయితే.. కొందరు నేతలు నింపాదిగా పన్నెండున్నరకు వచ్చారట. దీంతో టైమ్‌ సెన్స్‌ లేదా? టైమ్ విలువ తెలీదా అంటూ మాణిక్కం వాళ్లపై విరుచుకుపడ్డారట. మరో రెండుసార్లు ఇలా టైమ్‌ను ఫాలో అవ్వకపోతే అధిష్టానం అనుమతితో ఏకంగా పదవుల నుంచి తప్పించేస్తాన్నది కూడా మాణిక్కం వార్నింగ్‌.

Read Also….  Samajwadi Party: పార్టీ పునర్జీవం కోసం స్వయంగా రంగంలోకి దిగిన ములాయం సింగ్ యాదవ్