విద్యార్ధులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ అందించింది. జూలై 1వ తేదీ నుంచి మెట్రో రైలులో స్టూడెంట్ పాస్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 20 ట్రిప్పుల ఛార్జ్‌తో నగరంలోని ఏ ప్రాంతం నుంచైనా ఏ ప్రాంతానికి 30 ట్రిప్పుల ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. దీని వ్యాలిడిటీ 30 రోజులుగా నిర్ణయించింది. ఇందుకోసం విద్యార్ధులు సరికొత్త స్మార్ట్ కార్డును తీసుకోవాలని సూచించింది.
ఇక ఈ స్మార్ట్ కార్డులను జేఎన్టీయూ, ఎస్.ఆర్ నగర్, అమీర్‌పేట, విక్టోరియా మెమోరియల్, దిల్‌సుఖ్ నగర్, నారాయణగూడ, నాగోల్, పరేడ్ గ్రౌండ్స్, బేగంపేట్, రాయ్ దుర్గ్ మెట్రో స్టేషన్లలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య తీసుకోవచ్చునని తెలిపింది. ఈ స్టూడెంట్ పాస్ ఆఫర్ 9 నెలలు అందుబాటులో ఉంటుంది.
2023 జూలై 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఈ స్టూడెంట్ పాస్ ఆఫర్‌ను విద్యార్ధులు వినియోగించుకోవచ్చు. ఒక్కో విద్యార్థికి ఒక స్మార్ట్ కార్డ్ మాత్రమే జారీ చేయబడుతుందని స్పష్టం చేసింది మెట్రో సంస్థ. 1998, ఏప్రిల్ 1 తర్వాత జన్మించిన విద్యార్ధులు ఈ పాస్‌కు అర్హులని పేర్కొంది. కాగా, విద్యార్ధులు ఈ ఆఫర్ సద్వినియోగం చేసుకోవాలని మెట్రో సంస్థ ఎండీ ప్రకటించారు.
Introducing the Metro Student Pass.
An ultimate and convenient tool for Hyderabadi Students to ride the metro way.Get a brand new student pass metro card by showing your college ID card, recharge for 20 rides, and get 30 rides in 30 days. School/college-going is now made easier… pic.twitter.com/rHjDhQGPqU
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) July 1, 2023