Telangana Temperature: తెలంగాణలో ఎండలు భగభగ మండుతున్నాయి. గత రెండు మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ఉత్తర దిశ నుంచి అతి తక్కువ ఎత్తులో వేడి గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఫలితంగా రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ప్రకటించారు. ఈ మూడు రోజులు 44 డిగ్రీలి గరిష్ట ఉష్ణోగ్రత నమొదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వడగాడ్పుల నేపథ్యంలోనే.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల సమయంలో బయటి ప్రయాణాలేవీ చెయొద్దని హితవుచెప్పారు.
ఇదిలాఉండగా.. మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా 38.8-42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమొదు అయ్యాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం నాడు నగరంలో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
Also read: