Hyderabad: హైదరాబాద్ మెగా జాబ్ మేళా .. ప్రవేశం ఉచితం.. మరిన్ని వివరాలు మీ కోసం

|

May 13, 2023 | 8:51 AM

మీరు మీ క్వాలిపికేషన్‌కు తగ్గ మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..? మీ స్కిల్స్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీ కోసం మీ న్యూస్. హైదరాబాద్ మెగా జాబ్ మేళాకు రెడీ అవ్వండి. మరిన్ని వివరాలు మీ కోసం...

Hyderabad: హైదరాబాద్ మెగా జాబ్ మేళా .. ప్రవేశం ఉచితం.. మరిన్ని వివరాలు మీ కోసం
Job Mela
Follow us on

నగరానికి చెందిన డెక్కన్ బ్లాస్టర్స్ స్వచ్ఛంద సంస్థ మే 17, బుధవారం మాసబ్ ట్యాంక్‌లోని ఖాజా మాన్షన్ ఫంక్షన్ హాల్‌లో ‘ హైదరాబాద్ మెగా జాబ్ మేళా’ను నిర్వహించనుంది . వివిధ విభాగాలకు చెందిన కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయి. టాలెంట్ ఉన్న అభ్యర్థులను హైర్ చేసుకుంటాయి. కుల, వర్గ, మతాలకు అతీతంగా నిరుద్యోగ యువత కోసం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరూ అక్కడ తమ స్కిల్స్ ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళా ద్వారా ఎంతో ప్రయోజనం పొందవచ్చు.

అభ్యర్థుల కనీస అర్హత SSC అయి ఉండాలి. ఆపైన ఇంటర్, ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉన్నవాళ్లు అందరూ ఈ జాబ్ మేళాలో అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. అనుభవం ఉన్నవాళ్లు, లేనివాళ్లు ఇందులో పాల్గొనవచ్చు. వేదిక వద్ద ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. డెక్కన్ బ్లాస్టర్స్ వ్యవస్థాపకుడు ఇంజనీర్ మన్నన్ ఖాన్ మాట్లాడుతూ..  అనేక మంది నిరుద్యోగులు నగరంలో ఉద్యోగాల కోసం వెతుకుతున్నారని, వారికి  ఇదే ఉత్తమ జాబ్ మేళా అన్నారు. ఆర్‌ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ సపోర్ట్ చేసే జాబ్ మేళా  ప్రోగ్రామ్‌కి ప్రవేశం ఉచితం. ఆసక్తి ఉన్నవారు మరిన్ని వివరాల కోసం 8374315052 నంబర్‌లో సంప్రదించవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..