
హైదరాబాద్, అక్టోబర్ 29: తెల్లవారుజామున లేదా రాత్రి వేళల్లో మీరు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వెళ్తున్నారా..? అయితే మీకే అలెర్ట్.. ఎందుకంటే క్యాబ్ డ్రైవర్లు కొందరు అధిక చార్జీల వసూళ్లకు తెరలేపుతున్నారు. యాప్‌లో ఫేర్ చూస్తే ఒకలా ఉంటుంది… కానీ డ్రైవర్ ఫోన్ చేసి.. రెండింతలు.. మూడింతలు ధర చెప్తున్నారు. ఒక ప్రయాణికుడు తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదిక Redditలో పంచుకున్నారు. ఉదయం 7 గంటల విమానానికి వెళ్లేందుకు ఆయన ఉదయం 4 గంటలకు క్యాబ్ బుక్ చేశారు. బుకింగ్ అయిన తర్వాత డ్రైవర్ ఫోన్ చేసి డెస్టినేషన్ అడిగాడు. ఎయిర్‌పోర్టు అని చెప్పగానే.. ‘కొంచెం ఎక్స్‌ట్రా ఇవ్వండి సార్’ అని చెప్పాడట. ప్రయాణికుడు “యాప్‌లో ఎంత చూపిస్తుందో అంతే చెల్లిస్తా” అని చెప్పడంతో.. డ్రైవర్ మళ్లీ “రూట్ ఇష్యూ ఉంది.. ఆలస్యమవుతుంది.. రూ.5 వేలివ్వాలి” అంటూ షాక్ ఇచ్చాడు. చివరికి ఆ ప్రయాణికుడు రైడ్ రద్దు చేసుకుని స్నేహితుడితో వెళ్లిపోయాడట.
“ఇలాంటి సమస్య మరెవరైనా ఎదుర్కొంటున్నారా? తెల్లవారుజామున డ్రైవర్లు ప్యాసింజర్లను కావాలనే ఇలా వేధిస్తున్నారు?” అంటూ ఆయన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ పోస్టు కాసేపట్లోనే వైరల్ అయ్యింది. చాలా మంది నెటిజన్లు స్పందిస్తూ.. ఇదో పెద్ద స్కామ్ అని వ్యాఖ్యానించారు. “ఇలాంటివాళ్లతో వాదించకుండా క్యాన్సెల్ చేసి మళ్లీ బుక్ చేయండి” అని మరికొందరు కామెంట్ పెట్టారు. “ తెల్లవారుజామున ట్రాఫిక్ ఉండదు.. అప్పుడు ఎందుకింత డిమాండ్?” అంటూ మరికొందరు వాపోయారు.
Anyone else facing crazy cab prices to Hyderabad airport early in the morning?
byu/Resident_Beat_9246 inhyderabad ఇవి కూడా చదవండి
డ్రైవర్లు కొందరు తమ గ్రూప్ చాట్స్‌లో మాట్లాడుకుంటూ ఎయిర్‌పోర్టు రైడ్స్‌కు రేట్లు పెంచుతున్నారని కొందరు ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. మొత్తం మీద, తెల్లవారుజామున ఎయిర్‌పోర్టు ప్రయాణం అంటే ప్రయాణికులకు నరక యాతనగా మారిందనే వాదన బలపడుతోంది. ఇలాంటి దోపిడీపై అధికారులు, క్యాబ్ కంపెనీలు స్పందించాలని సిటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.