Hyderabad: చిట్టి తల్లి చేతులే నాన్నకు ఆధారం..’కరెంట్‌ షాక్‌తో రెండు చేతులు కోల్పోయిన తండ్రి’

|

Oct 16, 2022 | 6:43 PM

పచ్చగా ఉన్న ఆ కాపురంలో అనుకొని ప్రమాదం సంభవించి, కుటుంబ యజమాని రెండు చేతులు కోల్పోయాడు. భార్య కూలి పనుల కెళ్తే.. ఐదేళ్లయినా నిండని కూతురు అన్నీ తానై తండ్రికి సేవలు చేస్తోంది. మనసులను కలచి వేస్తోన్న ఈ హృదయవిదారక ఘటన..

Hyderabad: చిట్టి తల్లి చేతులే నాన్నకు ఆధారం..కరెంట్‌ షాక్‌తో రెండు చేతులు కోల్పోయిన తండ్రి
Electric Shock
Follow us on

పచ్చగా ఉన్న ఆ కాపురంలో అనుకొని ప్రమాదం సంభవించి, కుటుంబ యజమాని రెండు చేతులు కోల్పోయాడు. భార్య కూలి పనుల కెళ్తే.. ఐదేళ్లయినా నిండని కూతురు అన్నీ తానై తండ్రికి సేవలు చేస్తోంది. మనసులను కలచి వేస్తోన్న ఈ హృదయవిదారక ఘటన నగర పరిధిలో చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆపన్న హస్తం కోసం ఈ కుటుంబం ఎదురు చూస్తోంది. వివరాల్లోకెళ్తే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన పాట్నూరు సత్యనారాయణ(35) ఉపాధి నిమిత్తం 15 ఏళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చాడు. హైదరాబాద్‌ నగరంలోని గాజులరామారం షాపూర్‌నగర్‌లో నివసిస్తూ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో ఈ ఏడాది మే నెలలో ఓ దుకాణంపైన బోర్డు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవ శాత్తు విద్యుత్తు తీగలు కరెంట్‌ షాక్‌కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతని రెండు చేతులు కాలిపోయాయి. దీంతో కుటుంబానికి అన్నీ తానై లోటులేకుండా చూసుకుంటున్న కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడింది. ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్న సత్యనారాయణ కుటుంబ పోషణ భారం అతని భార్యపై పడింది.

ఇవి కూడా చదవండి

కూలీనాలీ చేసుకుని భర్త, బిడ్డలను చూసుకుంటోంది. ఐతే భార్య కూలి పనులకు వెళ్తే.. నిండా ఐదేళ్లయినాలేని కుమార్తె చందనప్రియే అతనికి తల్లై అన్ని పనులు చేస్తోంది. ఏపనీ చేయలేని స్థితిలో ఉన్న తనను ప్రభుత్వం ఆదుకోవాలని సత్యనారాయణ అభ్యర్ధిస్తున్నాడు. దివ్యాంగుల కోటా కింద పింఛను మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం నివాసముంటున్న ఇంటికి అద్దె కట్టలేని స్థితిలో ఉన్నామని, ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తే తన భార్య, బిడ్డలకు గూడు ఏర్పడుతుందని అభ్యర్థిస్తున్నారు.