
మత్తు వ్యసనం మనుషులను ఎలా కుంగదీస్తుందో.. మానసికంగా బలహీనుల్ని చేస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహారణ. కల్లు దొరకకపోవడంతో పచ్చిక ప్రవర్తించిన వ్యక్తి నిమ్స్ ఆసుపత్రి ఎమర్జెన్సీ వింగ్ బిల్డింగ్ నుంచి దూకి అత్మాహత్యయత్నం చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన హనుమండ్ల అనే వయసు పైబడిన వ్యక్తి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో అతడిని ఇద్దరు కొడుకులు ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. హనుమండ్ల రెండవ కొడుకు నారాయణ కల్లు తాగకుండా ఒక్క రోజు కూడా ఉండేవాడు కాదు. ఒక రకంగా ఆ మత్తుకు బానిసయ్యాడు. గత కొన్ని రోజులుగా కల్లు దొరక్కపోవడంతో ఆసుపత్రిలో వింతగా ప్రవర్తిస్తూ ఆస్పత్రిలో అందర్నీ భయబ్రాంతులకు గురిచేశాడు.
అకస్మాత్తుగా నారాయణ ఎవరూ ఊహించని విధంగా ఆస్పత్రి ఎమర్జెన్సీ విభాగం సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకు దూకాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా తలకు బాగా దెబ్బలు తగిలాయి. వెంటనే స్పందించిన ఆస్పత్రి సిబ్బంది, అతన్ని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన ఆసుపత్రిలో కలకలం చెలరేగింది. ఇటు వృద్ధుడి ఆరోగ్యం క్షిణించడం, మరోవైపు కుమారుడి ప్రమాదకరమైన చర్యలు ఆసుపత్రి సిబ్బంది సైతం గగుర్పాటుకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. నారాయణ ఆల్కాహాల్ విత్ డ్రావల్ సింటమ్స్‌తోనే అలా ప్రవర్తించి ఉండొచ్చని.. లేదా కల్లీ కల్లు అయినా సేవించి ఉంటాడని మానసిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..