Hyderabad: పైకి చూస్తే జొమాటో బ్యాగ్.. తెరిచి చూడగా పోలీసులు షాక్‌

|

Feb 08, 2024 | 4:35 PM

సరఫరాలో కూడా అక్రమార్కులు కొత్త కొత్త పంథాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. ఎవరి కంటపడకుండా డ్రగ్స్‌ను సరఫరా చేసేందుకు కొత్త దారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన పోలీసులనే అవాక్కయ్యేలా చేసింది. తాజాగా...

Hyderabad: పైకి చూస్తే జొమాటో బ్యాగ్.. తెరిచి చూడగా పోలీసులు షాక్‌
Representative Image
Follow us on

డగ్స్‌ భూతం సమాజాన్ని పట్టి పీడిస్తోంది. పోలీసులు, అధికారులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా.? ఎంత గస్తీ కాస్తున్నా.? డ్రగ్స్ దందా యథేశ్చగా సాగుతోంది. పట్టపగలే డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు కేటుగాళ్లు. డ్రగ్స్‌ అక్రమ రవాణాకు సంబంధించి ఎన్నో కేసులు వెలుగులోకి వస్తున్నా రోజురోజుకీ అక్రమ దందా కొనసాగుతూనే ఉంది.

ఇక డ్రగ్స్‌ సరఫరాలో కూడా అక్రమార్కులు కొత్త కొత్త పంథాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. ఎవరి కంటపడకుండా డ్రగ్స్‌ను సరఫరా చేసేందుకు కొత్త దారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన పోలీసులనే అవాక్కయ్యేలా చేసింది. తాజాగా హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను అక్రమంగా సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఇద్దరు నిందితులు జొమాటో బ్యాగ్‌లో డ్రగ్స్‌ డెలివరీ చేస్తున్నారు. దీంతో అనుమానం వచ్చిన మాదాపూర్ పోలీసులు బ్యాగ్‌ను ఓపెన్ చేసి చూడగా.. డ్రగ్స్‌ కనిపించడంతో కంగుతిన్నారు. అదుపులోకి తీసుకున్న నిందులను పవన్, ఆదర్శ్ సింగ్‌ల గుర్తించినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు వారి నుంచి 21 గ్రాముల ఎండీఎంఏ, 873 గ్రాముల గంజాయితో పాటు రెండు ఫోన్లు, వేయింగ్ మిషన్ కూడా సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..