Yatra 2: థియేటర్‌లో పవన్, జగన్ ఫ్యాన్స్ మధ్య గొడవ.. 20 మంది అరెస్ట్..!

Yatra 2: థియేటర్‌లో పవన్, జగన్ ఫ్యాన్స్ మధ్య గొడవ.. 20 మంది అరెస్ట్..!

Ram Naramaneni

|

Updated on: Feb 08, 2024 | 6:35 PM

'యాత్ర 2' సినిమాలో జనసేనాని పవన్ ప్రస్తావన లేదు. కానీ, ఒక్క చోట పరోక్షంగా జనసేన పార్టీ గురించి ప్రస్తావించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 'తలాతోకా లేని కొత్త పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే ఒక్క శాతం ఓటు తేడాతో అధికారం వచ్చింది' అని చంద్రబాబు పాత్రధారి మహేష్ మంజ్రేకర్ చెబుతారు. ఆ కామెంట్స్ వల్ల గొడవ జరిగిందా? లేదంటే మరొక కారణం ఏమైనా ఉందా? అనేది తెలియాల్సి ఉంది.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా  తీసిన యాత్ర మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది యాత్ర 2. వైఎస్‌ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తీశాడు దర్శకుడు మహి వి.రాఘవ్‌. ఈ మూవీ నేడు (ఫిబ్రవరి 8) ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రివ్యూస్ అందుకుంటుంది. వైఎస్‌ఆర్‌గా మమ్ముట్టి …వైఎస్ జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా తమ తమ పాత్రలకు జీవం పోశారని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. తెలిసిన విషయాన్నే గొప్పగా చెప్పడంలో డైరెక్టర్‌కి ఫుల్ మార్కులు ఇస్తున్నారు సినీ విమర్శకులు. అయితే వైసీపీ పార్టీకి అనుకూలం.. ప్రతిపక్షపార్టీలకు ప్రతికూలమే అవుతుంది. ఈ క్రమంలోనే పలు చోట్ల సినిమా హాళ్లలో ఘర్షణలు చేటుచేసుకుంటున్నాయి.

తాజాగా ప్రసాద్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్ 2లో పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ అభిమానుల మధ్య గొడవ జరిగింది.  సినిమా ప్రదర్శన మధ్యలో జగన్ , పవన్ అభిమానులు బాహాబాహీకి దిగారు. దీంతో థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారమిచ్చింది. రంగంలోకి దిగిన ఖాకీలు 20 మంది వరకు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. అభిమానుల మధ్య గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్నితెలంగాణ  వార్తల కోసం క్లిక్ చేయండి..

Published on: Feb 08, 2024 06:31 PM