Kavitha vs Konda Surekha: ఆయన్ను డీజీపీగా ఎందుకు కూర్చోబెట్టారు? కవితకు మంత్రి కొండా సురేఖ కౌంటర్
TSPSC చైర్మన్ పదవి నుంచి మహేందర్ రెడ్డిని తప్పించి, ఆయనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. మహేందర్ రెడ్డి నియామకంపై గవర్నర్‌ను కూడా కలుస్తామన్నారు.
TSPSC చైర్మన్ పదవి నుంచి మహేందర్ రెడ్డిని తప్పించి, ఆయనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. మహేందర్ రెడ్డి నియామకంపై గవర్నర్‌ను కూడా కలుస్తామన్నారు. అలాగే రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని కమిషన్ సభ్యులుగా ఎలా నియమించారని ప్రశ్నించారు అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ కౌంటరిచ్చారు. మహేందర్ రెడ్డికి అవినీతి మరక ఉంటే ఆయన్ను డీజీపీగా ఎందుకు కూర్చోబెట్టారని ప్రశ్నించారు. ఆయన ఏమైనా లిక్కర్ స్కాం చేశారా? పేపర్లు లీక్ చేశారా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాటను తాము నిలబెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేక తమపై అక్కసుతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
వైరల్ వీడియోలు
Latest Videos