రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌పై గవర్నర్ తమిళిసై కీలక కామెంట్స్..
తమ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో 2 ఇప్పటికే అమలు చేశామని.. త్వరలోనే మరో 2 అమలు చేస్తామని గవర్నర్ తమిళిసై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ వీలైనంత త్వరగా అమలు చేస్తామని అన్నారు.
తమ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో 2 ఇప్పటికే అమలు చేశామని.. త్వరలోనే మరో 2 అమలు చేస్తామని గవర్నర్ తమిళిసై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ వీలైనంత త్వరగా అమలు చేస్తామని అన్నారు. సకాలంలో 6 గ్యారెంటీలను అమలు చేస్తాం. 2 లక్షల ఉద్యోగాల భర్తీపైన కూడా తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని అని అన్నారు గవర్నర్. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారని కొనియాడారు. ప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా తమ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టిందన్నారు.
ప్రజాపాలన పాలనలో భాగంగా గ్రామసభలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం కింద 1.8 కోట్ల దరఖాస్తులు వచ్చాయని గవర్నర్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి, 2 లక్షల ఉద్యోగాలపై ఫోకస్ చేశామని..ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను కూడా తమ ప్రభుత్వం చక్కబెడతుందని చెప్పారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం, మౌలిక వసతుల రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్త MSME విధానాన్ని కూడా అమలులోకి తీసుకొస్తామన్నారు.