Hyderabad: గచ్చిబౌలిలో విడివిడిగా 15 మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ అరెస్ట్ – ఎందుకే తెలిస్తే బిత్తరపోతారు

హైదరాబాద్‌లో ఐటీ కారిడార్‌లో గంజాయి వాసన గుప్పుమంది. ‘బచ్చాఆగయా’ అనే కోడ్ మెసేజ్‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని ఈగల్ టీమ్ పట్టుకుంది. అతనిచ్చిన సమాచారంతో చేసిన ప్రత్యేక డెకాయ్ ఆపరేషన్‌లో గంజాయి తీసుకుంటున్న 15 మంది ఐటీ ఉద్యోగులు పోలీసులకు చిక్కారు.

Hyderabad: గచ్చిబౌలిలో విడివిడిగా 15 మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ అరెస్ట్ - ఎందుకే తెలిస్తే బిత్తరపోతారు
Hyderabad News

Updated on: Jul 13, 2025 | 6:33 PM

హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా గంజాయి దందా గుట్టు రట్టు చేసింది ఈగల్‌ టీమ్‌. ప్రత్యేకంగా నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్‌లో డ్రగ్ పెడ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐటీ క్యాంపస్‌లు, టెక్‌ కారిడార్‌ ప్రాంతాల్లో ఈ స్థాయిలో గంజాయి అమ్మకం, వినియోగం జరగడంపై అధికారులే స్టన్ అయ్యారు. పోలీసులు అరెస్టు చేసిన డ్రగ్ పెడ్లర్ సందీప్‌.. ‘బచ్చాఆగయా’ అనే కోడ్ పేరుతో గంజాయి కొనుగోలుదారులతో కమ్యూనికేషన్ చేస్తుండటాన్ని గుర్తించారు. ఇందుకోసం అతను 100 మందితో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే టార్గెట్‌ అయినట్లు వెల్లడించారు.

దీంతో గంజాయి వినియోగించేవారిని పట్టుకునేందుకు అధికారుల డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 15 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు గంజాయి కోసం వచ్చి పోలీసులకు చిక్కారు. వీరంతా సందీప్ ద్వారా మెసేజ్‌లు పొందుతూ.. మత్తు పదార్థాలు కొంటున్నట్లు నిర్ధారణ అయ్యింది. పోలీసుల వివరాల ప్రకారం… గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో పనిచేసే యువత గంజాయి వాడకానికి బానిసలవుతున్నట్లే గమనించామని వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి