Hyderabad: హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్.. రోడ్లకు మహర్దశ.. తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు

జీహెచ్‌ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని రోడ్లకు మహర్థశ కలగనుంది. ఈ మేరకు రోడ్లను అభివృద్ది చేసేందుకు ప్రత్యేక నిధులను కేటాయించారు. ఈ నిధులతో రోడ్లకు మరమ్మత్తులు నిర్వహించనున్నారు. దీంతో వాహనదారులకు సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుందని చెప్పవచ్చు.

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్.. రోడ్లకు మహర్దశ.. తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు
Flyover

Updated on: Mar 29, 2026 | 2:21 PM

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. నగరలో రోడ్లు మరమ్మత్తుల కోసం జీహెచ్‌ఎంసీ ముందడుగు వేసింది. అందులో భాగంగా నగరంలోని మూడు జోన్లలో రోడ్ల అభివృద్ది పనులను చేపట్టేందుకు రంగం సిద్దమైంది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్ నగర పాలక సంస్థ, మల్కాజ్‌గిరి నగరపాలక సంస్థ కలిసి నగరవ్యాప్తంగా రోడ్లకు మరమ్మత్తులు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆరు జోన్లకు రూ.150 కోట్ల నిధులు కేటాయించారు. అంటే ప్రతీ జోన్‌కు రూ.25 కోట్ల చొప్పున కేటాయింపు జరిగింది. ఈ బడ్జెట్‌తో అత్యవసర రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణణ్ ఆదేశాలు జారీ చేశారు. గుంతల రోడ్లను పూడ్చడంతో పాటు రోడ్లు సరిగ్గా లేని చోట సరిచేయడం వల్ల పనులు చేపడతారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.

త్వరలోనే పనులు ప్రారంభం

రోడ్ల మరమ్మత్తుల పనుల కోసం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఇక కంప్రాహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రొగ్రాం కింద 1045.01 కిలోమీటర్ల ప్రధాన రహదారులను రూ.3,145 కోట్ల ఖర్చుతో శాశ్వత ప్రాతిపాదికన అభివృద్ది చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పనులన్నీ పూర్తయితే నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. ఇక సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. త్వరలోనే ఈ పనులను ప్రారంభించనుండగా.. ఈ ఏడాదికల్లా పనులన్నీ పూర్తి చేయాలనే డెడ్ లైన్ పెట్టుకున్నారు. అయితే గతంలో హైదరాబాద్‌లో రోడ్ల పొడవు 9 వేల కిలోమీటర్లుగా ఉండేది. కానీ ప్రభుత్వం ఇటీవల 27 స్థానిక సంస్థలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసింది. దీంతో రోడ్ల పొడవు 14,787.66 కిలోమీటర్లకు చేరుకుంది.

రూ.150 కోట్ల ప్రత్యేక నిధులు

నగర శివారు ప్రాంతాల్లో ఉన్న మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా మార్చేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రచిస్తోంది. అయితే రోడ్ల అభివృద్ది పనుల కోసం కార్పొరేట్లకు కేటాయించిన నిధులు కేవలం సీసీ రోడ్ల నిర్మాణానికే సరిపోతుంది. దీంతో మెయిన్ రోడ్ల నిర్మాణం జరగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ప్రధాన రహదారుల నిర్వహణ సరిగ్గా లేవడం లేదని విమర్శలు వస్తున్నాయి. దీంతో జీహెచ్‌ఎంసీ మెయిన్ రోడ్ల మరమ్మత్తులు, అభివృద్ది కోసం ప్రత్యేకంగా ఇప్పుడు నిధులు కేటాయించింది. ఈ నిధులతో హైదరాబాద్‌లో రోడ్లు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయి. అటు నగరంలో గుంతల రోడ్ల వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నాయి. వర్షాల సమయంలో గుంతల్లోకి నీళ్లు చేరుకోవడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం  కలుగుతుంది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఇప్పుడు రోడ్లకు మరమ్మత్తు పనులు చేపట్టనున్నారు.

Follow Us