Scrub Typhus: హైదరాబాదీలను హడలెత్తిస్తున్న కొత్త వ్యాధి.. గాంధీ ఆసుపత్రిలో 15 కేసులు..

|

Dec 22, 2021 | 11:27 AM

Hyderabad Gandhi hospital: తెలంగాణలో ఇప్పటికే కరోనా మహమ్మారి భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ తరుణంలోనే వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త రకం వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే

Scrub Typhus: హైదరాబాదీలను హడలెత్తిస్తున్న కొత్త వ్యాధి.. గాంధీ ఆసుపత్రిలో 15 కేసులు..
Scrub Typhus
Follow us on

Hyderabad Gandhi hospital: తెలంగాణలో ఇప్పటికే కరోనా మహమ్మారి భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ తరుణంలోనే వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త రకం వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మరో కొత్త రకం వ్యాధి హైదరాబాద్ ప్రజలను హడలెత్తిస్తోంది. భాగ్యనగరంలో ఈ స్క్రబ్‌ టైఫస్‌ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఏకంగా 15 మంది ఈ స్క్రబ్‌ టైఫస్‌ చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బాధితుల్లో పిల్లలే ఎక్కువమంది ఉన్నారట.. ఈ నెలలో నలుగురు చిన్నారులు ఆసుపత్రిలో చేరారు. ఇప్పటికే ఇద్దరికి తగ్గిపోగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. స్క్రబ్ టైఫస్ పురుగులు కుట్టడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఇప్పటివరకు స్క్రబ్ టైఫస్ (బుష్ టైఫస్) వ్యాధి సోకిన 15 మందికి చికిత్స అందించారు. ఈ బాధితుల్లో ఎక్కువగా చిన్నారులు ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఇటీవల గాంధీ ఆసుపత్రిలో నలుగురు చిన్నారులు చేరగా.. ఇద్దరికీ తగ్గిపోయిందని.. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా.. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో సబ్ టైఫస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల ఒడిశా రాష్ట్రంలో దాదాపు 500 కేసులు నమోదయ్యాయి. యూపీలో కూడా చాలామంది చిన్నారులు ఈ వ్యాధి బారిన పడ్డారు. దీంతోపాటు పలువురు మృతిచెందినట్లు వార్తలు కూడా వచ్చాయి.

స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి?
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. స్క్రబ్ టైఫస్ అనేది (ఓరియంటియా సుట్సుగముషి ) బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. దీనిని బుష్ టైఫస్ అని కూడా అంటారు. ఈ ఇన్ఫెక్షన్ పురుగుల (లార్వా మైట్స్) కాటు ద్వారా ప్రజలకు వ్యాపిస్తుంది.

నల్లిని పోలి ఉంటాయి..
స్ర్కబ్ టైఫస్ పురుగులు ఇళ్లలో, మంచాలు, పెరటి మొక్కల్లో, తడిగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతుంటాయి. చూడటానికి ఈ పురుగులు చిన్న సైజులో నల్లిని పోలి ఉంటాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ పురుగులు ఎక్కువగా రాత్రి సమయాల్లో కనిపిస్తాయని వెల్లడించారు.

స్క్రబ్ టైఫస్ లక్షణాలు..
ఈ పురుగు కుడితే తీవ్రమైన జ్వరం, చలి, తలనొప్పి కళ్లు, ఒళ్లు, కండరాల నొప్పులు, శరీర నొప్పులు, దద్దుర్లు వస్తాయి. పురుగు కాటుకు గురైన 10 రోజులలోపు ఈ లక్షణాలు ప్రారంభమవుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు పేర్కొంటున్నారు. కాగా.. స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

స్క్రబ్ టైఫస్‌కు చికిత్స..
CDC ప్రకారం.. స్క్రబ్ టైఫస్‌ను నివారించడానికి టీకా అందుబాటులో లేదు. ఇన్ఫెక్షన్ సోకిన వారితో సంబంధాన్ని నివారించడం ముఖ్యం. అయితే.. కాటు ద్వారా క్రమంగా ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది. స్క్రబ్ టైఫస్ నివారణకు.. చేతులు, కాళ్లను కప్పి ఉంచే దుస్తులను పిల్లలకు ధరించాలని సూచిస్తున్నారు. దొమతెరలను ఉపయోగించాలని పేర్కొంటున్నారు.

ఎవరైనా స్క్రబ్ టైఫస్ బారిన పడినట్లయితే ఆ వ్యక్తికి యాంటీబయాటిక్ డాక్సీసైక్లిన్‌తో చికిత్స చేయాలని సీడీసీ చెబుతోంది. ఏజెన్సీ ప్రకారం.. డాక్సీసైక్లిన్‌తో ప్రారంభ చికిత్స పొందిన వ్యక్తులు సాధారణంగా త్వరగా కోలుకుంటారని పేర్కొంది.

Also Read:

అర్ధరాత్రి ఉలిక్కిపడిన బిల్డింగ్ వాసులు.. ఏడో అంతస్తు నుంచి నగ్నంగా కిందపడిన యువతి.. ఆ తర్వాత..

Crime News: ఇంట్లోకి వెళ్లకుండానే చనిపోయాడు.. లిఫ్ట్‌లో చిక్కుకొని బాలుడి దుర్మరణం.. అసలేమైందంటే..?