Hyderabad: హైదరాబాద్ బల్దియా వాసులకు ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి. డబ్బులు లేక తమ బంధువులు, కుటుంబ సభ్యుల అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కూడా ఆపసోపాలు పడుతున్న ప్రజలకు ఈ న్యూస్ పెద్ద ఊరటన నిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇకపై హైదరాబాద్ పరిధిలో రూపాయి ఖర్చు లేకుండా అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. ఇక నుంచి చనిపోయిన వారి పార్థీవ దేహాలనుతరలించడానికి ఉచితంగా ‘అంతిమ యాత్ర వాహనం’ ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. ఏ కారణంగానైనా గానీ చనిపోయిన వ్యక్తులని ఆసుపత్రి నుంచి శ్మశానానికి లేదా ఇంటి నుంచి శ్మశానానికి తరలించడం కోసం గానీ ఉచితంగా వాహనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లకు కలిపి 14 వాహనాలను కేటాయించారు అధికారులు. అలాగే.. వాహనాల మానిటరింగ్ కోసం ఒక్కొక్క జోన్‌కి ఇద్దరు అధికారులను కేటాయించారు. దీనికి సంబంధించి ఉత్తర్వులను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సోమవారం నాడు విడుదల చేశారు. కాగా, ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ సైతం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు.. వాహనాల మానిటరింగ్ కోసం కేటాయించిన అధికారుల వివరాలను కూడా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Here’s complete list of contact # zone wise for @GHMCOnline …
to ask for “Antim yatra rathamu” ie to carry the deceased from home / hospital to cremation/ burial ground FREE OF COST
This is done on @KTRTRS instructions in view of # of complaints of ambulance charging heavily pic.twitter.com/Ut4OVyBt6f
— Arvind Kumar (@arvindkumar_ias) May 24, 2021
Also read:
Family Man 2: ముదురుతున్న వెబ్ సిరీస్ వివాదం.. ఫ్యామిలీ మ్యాన్2 పై సీరియస్ అయిన తమిళనాడు ప్రభుత్వం..
అనుమతి లేకుండానే కోవిడ్ పరీక్షలు.. మంచిర్యాలలో పట్టుబడిన ప్రైవేటు ల్యాబ్ నిర్వాహకులు
Lion vs Tiger Viral Video: లయన్ వర్సెస్ టైగర్.. వారెవ్వా ఎంత చూడముచ్చటగా ఉన్నాయో..!