AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: 65 మంది అమ్మాయిలు, అబ్బాయిలు.. అంతా గుట్టుగా ఫామ్‌హౌస్‌లో తేలారు.. చివరకు..

నిండా 20 ఏళ్లు కూడా నిండా నిండని పిల్లలను పార్టీ పేరుతో ట్రాప్‌ చేసి, మత్తులో ముంచిన బద్మాష్‌ బాగోతం కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ చెర్రీ ఓక్స్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పార్టీలో మొత్తం 65 మంది పాల్గొన్నారు.

Hyderabad: 65 మంది అమ్మాయిలు, అబ్బాయిలు.. అంతా గుట్టుగా ఫామ్‌హౌస్‌లో తేలారు.. చివరకు..
Moinabad drug case
Shaik Madar Saheb
|

Updated on: Oct 06, 2025 | 6:31 PM

Share

నిండా 20 ఏళ్లు కూడా నిండా నిండని పిల్లలను పార్టీ పేరుతో ట్రాప్‌ చేసి, మత్తులో ముంచిన బద్మాష్‌ బాగోతం కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ చెర్రీ ఓక్స్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పార్టీలో మొత్తం 65 మంది పాల్గొన్నారు. వారిలో 59మంది స్టూడెంట్స్ ఉండగా అందర్ని ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ 59మంది విద్యార్థులో 22 మంది మైనర్లుగా గుర్తించారు. అందులో 5 అమ్మాయిలు ఉండగా, మరో 17 మంది అబ్బాయిలు ఉన్నారు. ఇన్‌స్టాలో పరిచయమైన వీరంతా జట్టుగా మారి మత్తు పార్టీ చేసుకున్నారు. హైదరాబాద్ చెర్రీ ఓక్స్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి..

మైనర్లపై మత్తు వల విసిరింది ఇషాన్‌ అనే యువకుడిగా పోలీసులు తెలిపారు.. ఇటీవలే కెనడా నుంచి హైదరాబాద్ వచ్చిన ఇషాన్.. పార్టీలకి అలవాటు పడి సెల్ఫ్‌గా పార్టీలను కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ట్రాప్ హౌస్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్లో ఒక పేజ్ క్రియేట్ చేసి ఈ పార్టీ ఆర్గనైజ్ చేశాడు. ఇది మామూలు పార్టీ కాదని.. ఇక్కడకు వస్తే అంతులేని ఆనందాన్ని ఆస్వాదించవచ్చంటూ ఊరించాడు. ఇన్‌స్టాలో ఇది చూసిన మైనర్లు పార్టీకి హాజరైయ్యారు. వారంతా మత్తులో జోగుతున్న సమయంలో పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నాకు.

ఫామ్‌హౌస్‌ యజమాని శేషగిరితోపాటు, ఆర్గనైజర్‌ ఇషాన్‌ సహా ఆరు గురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. సూపర్‌వైజర్‌ ఠాకూర్‌ మనీష్‌, DJ ప్లేయర్లు రమేష్‌, రోహిత్‌.. మరో ఇద్దరు మైనర్లపై కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు టెస్టులు చేయగా, ఇద్దరికి గంజాయి పాజిటివ్‌ అని తేలింది. 8 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు SOT పోలీసులు..

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే