ఓర్నాయనో.. మార్కెట్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా..? ఇది చూస్తే కళ్లు తేలేయాల్సిందే..

| Edited By: Shaik Madar Saheb

Nov 19, 2024 | 7:38 PM

సాధారణంగా ఏ కూర చేయాలనుకున్నా సరే.. అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పనిసరిగా ఉపయోగిస్తాం.. గతంలో అల్లం వెల్లుల్లి పేస్టును నేరుగా ఇంట్లోనే తయారు చేసుకునేవారు. కానీ, బిజీలైఫ్ లో కాలక్రమేనా వీటిని తయారు చేసుకునే విధానం పూర్తిగా మారిపోయింది. కొంతమంది కేటుగాళ్లు తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభం వస్తుందని ఆశపడి జనాల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.

ఓర్నాయనో.. మార్కెట్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా..? ఇది చూస్తే కళ్లు తేలేయాల్సిందే..
Ginger Garlic Paste
Follow us on

సాధారణంగా ఏ కూర చేయాలనుకున్నా సరే.. అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పనిసరిగా ఉపయోగిస్తాం.. గతంలో అల్లం వెల్లుల్లి పేస్టును నేరుగా ఇంట్లోనే తయారు చేసుకునేవారు. కానీ, బిజీలైఫ్ లో కాలక్రమేనా వీటిని తయారు చేసుకునే విధానం పూర్తిగా మారిపోయింది. కొంతమంది కేటుగాళ్లు తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభం వస్తుందని ఆశపడి జనాల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ ను తయారుచేసి దానికి వివిధ రకాల బ్రాండ్ పేర్లను జతపరుస్తూ మార్కెట్లోకి వదులుతున్నారు. అసలు నిజం తెలియక వాటిని కొనుగోలు చేస్తూ ప్రజలు అనారోగ్యం బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఇటీవల హైదరాబాదులోని బోయిన్‌పల్లిలోని ఒక గోడౌన్ లో తయారు చేస్తున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కేంద్రంపై పోలీసులు దాడి నిర్వహించారు. ఈ తనిఖీలో ఆశ్చర్యకర నిజాలు బయటపడ్డాయి. Sony ginger garlic paste పేరుతో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును ఈ ముఠా తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం ఎనిమిది మంది నిందితులు కలిసి ఈ దందా నిర్వహిస్తున్నారు. తక్కువ ధరకు దొరికే కెమికల్స్ ను ఉపయోగించి అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీలో సిట్రిక్ యాసిడ్ తో పాటు మరికొన్ని కెమికల్స్ ను ఉపయోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ తయారీ కేంద్రం కూడా పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో ఉందని.. ఇక్కడే కల్లీ పేస్ట్ ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కెమికల్స్ ఉపయోగించి తయారు చేసిన ఈ పేస్టును కొన్ని రోజులపాటు ప్లాస్టిక్ డబ్బులలో ఉంచగా.. వాటి మీద పురుగులు తిరుగుతూ కనిపించాయి.. వాటిని కనీసం తొలగించకుండానే అలానే ప్యాకెట్లలో ప్యాక్ చేసి దేశవ్యాప్తంగా వీళ్ళు సప్లై చేస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.

వీడియో చూడండి..

కల్తీ పదార్థాన్ని తయారు చేసేందుకు పెద్దగా ఖర్చు కూడా ఉండదు. తక్కువ పదార్థాలతో నిజమైన పేస్టును తయారు చేస్తున్నామని నమ్మించి ఈ తరహా చౌకబారు పనులకు పాల్పడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు . వీరిలో షకీల్ అహ్మద్ అనే వ్యక్తి కీలక నిందితుడుగా ఉన్నాడు. సమీర్ అన్సారి మేనేజర్ గా పనిచేస్తున్నాడు.. ముక్తర్ ఈ మొత్తం పేస్టును తయారుచేసి రంజిత్ కుమార్, సోను కుమార్, ఇనాయథ్, మహేష్ కుమార్ ద్వారా మార్కెట్లోకి వదులుతున్నాడు.

మొత్తం 1500 కేజీల కల్తీ పేస్టుతో పాటు, 55 కేజీల సిట్రిక్ యాసిడ్, 480 కేజీల వెల్లుల్లి కొన్ని కెమికల్స్ తో పాటు మరికొన్ని పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. కట్టుబడిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..