Hyderabad: హైదరాబాద్‌ పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు.. మూడు గంటల పాటు నడిరోడ్డుపై రభస

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు.

Hyderabad: హైదరాబాద్‌ పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు.. మూడు గంటల పాటు నడిరోడ్డుపై రభస
Representative Image
Image Credit source: TV9 Telugu

Updated on: Mar 30, 2022 | 10:26 AM

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్(Drunk and Drive) నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. గత అర్థరాత్రి బంజారాహిల్స్(Jubilee Hills) పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. అయితే ఫుల్‌గా మందేసిన తాగుబోతులు పోలీసులపై తిరగబడ్డారు. దాదాపు మూడు గంటల పాటు నడిరోడ్డుపై మందుబాబులు రభస సృష్టించారు. మేం ఫలానా ఎమ్మెల్యే అనుచరులమంటూ వీరంగం సృష్టించారు. వారిని కట్టడి చేయడం పోలీసులకు కష్టతరంగా మారింది.

రోడ్డుపై పడుకుని బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లు చేయవద్దంటూ డ్రంకన్ డ్రైవర్లు హంగామా సృష్టించారు. రోడ్డుపై అడ్డంగా పడుకుని నిరసనను వ్యక్తం చేశారు. మేడ్చల్ ఎమ్మెల్యే అనుచరులమని, తమనే ఆపుతారా అంటూ గోల గోల చేశారు. అయితే సరైన పత్రాలు చూపించకపోవడంతో పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? వాళ్లకీ ఆయనకు సంబంధం ఏంటి? ఎమ్మెల్యే పేరు చెబితే వదిలేస్తారని డ్రామా ఆడారా? లేక నిజంగానే ఎమ్మెల్యే అనుచరులా? అన్నది తేలాల్సి ఉంది.

అటు పోలీసులపై మందుబాబులు ఆరోపణలు చేశారు. కాస్ట్‌లీ కార్లను వదిలేశారని.. చిన్నా చితకా వెహికల్స్‌లో వచ్చే వారిని మాత్రమే ఆపి డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారని నిలదీశారు. ఇలా చేయడం ఏమి రూలంటూ ప్రశ్నించారు. అయితే వారి ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు. కొన్ని కార్లను వదిలేసి.. కొన్నింటికి మాత్రమే డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నామన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. మాకు అందరూ సమానమేనంటూ బదులిచ్చారు పోలీసులు. తమ దగ్గర వీడియో కూడా ఉంటుందన్నారు.

Also Read..

Viral Video: మహాతల్లి.. ఫోన్ చూస్తూనే వెళ్లింది.. చివరకు దిమ్మతిరిగిపోయింది.. వైరల్ వీడియో..

Viral Video: కుక్కపిల్లకు చుక్కలు చూపించిన బాతు !! వీడియో చూస్తే షాకే..