Hyderabad Drugs Case: హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రాడిసన్ బ్లూప్లాజా హోటల్‌లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ (Pudding and Mink pub) కేసుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. దర్యాప్తు సాగిన కొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంలో హోటల్ (Hotel)లోని పుడింగ్ అండ్ మింక్ పబ్, బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్‌ను ఎక్సైజ్ శాఖ రద్దు చేసింది. పబ్‌లో జరిగిన ఘటనపై ఎక్సైజ్ శాఖ (Excise Department) ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. దాడిలో కొకైన్‌తో పాటు ఇతర మాదకద్రవ్యాలు పట్టుబడినట్లు పోలీసలు ఎఫ్‌ఆర్‌లో నమోదు చేశారు. ఈ కేసు వ్యవహారంలో సమీక్షించిన ఎక్సైజ్ శాఖ పబ్, బార్ అండ్ రెస్టారెంట్ నిబంధనలు ఉల్లంఘించినట్లు స్పష్టం చేసింది. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పందిస్తూ.. వెంటనే లైసెన్స్ రద్దు చేయాల్సిందిగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు. ఆయన వెంటనే పబ్, బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేయాలని హైదరాబాద్ ఇంఛార్జి డీసీ అజయ్‌రావ్‌ను ఆదేశించారు. దీంతో రెండింటి లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు వెల్లడించారు.
కాగా, తెలంగాణలో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డ్రగ్స్ వినియోగం, అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల వినియోగం, అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. అయితే పబ్‌లలో డ్రగ్స్‌ను వినియోగించకుండా పబ్ యజమానులే బాధ్యత వహించాల్సి ఉందని స్పష్టంగా చెప్పామని మంత్రి తెలిపారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ఇందులో ఎంతటివారి ప్రమేయం ఉన్న వదిలిపెట్టేది లేదని మంత్రి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి: