Hyderabad Water Supply Alert : వాటర్ బోర్డ్ సరఫరా చేసే నీరు, ఇళ్లలోని బోర్లతో ఇన్నాళ్లు గొంతు తడుపుకున్న గ్రేటర్ వాసులు వేసవిలో నీటి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. భూగర్భజలాలు అడుగంటడంతో ఇళ్లలోని బోర్లన్నీ ఎండిపోయాయి. దీంతో వాటర్‌బోర్డ్ సరఫరా చేసే నీటిపైనే ఆధారపడుతున్నారు. సుమారు కోటి జనాభా ఉన్న మహానగరానికి వాటర్ బోర్డ్ సరఫరా చేసే నీరు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని పలు బస్తీలు, కాలనీలలో ఇప్పటికే నీటి సమస్య ఎదురవుతూనే ఉంది. ఎగువ ప్రాంతాలకు నీటి సరఫరా కు చాలా కష్టం అవుతుంది. పలు కాలనీలకు, బస్తీలకు వాటర్ ట్యాంకర్లే దిక్కవుతున్నాయి. ఇదిలా ఉంటే నాగోల్ బ్రిడ్జి వద్ద జలమండలి 1600 ఎంఎం డయా రింగ్ మెయిన్ పైపులైన్ విస్తరణ మరియు మరమ్మత్తుల పనులు చేపడుతున్న కారణంగా తేది: 18.03.2021 గురువారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అనగా తేది: 19.03.2021 శుక్రవారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు ఈ పనుల ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఈ 24 గంటలు కింద ఇవ్వబడిన ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
మన్సూరాబాద్, నాగోల్, ఆర్.కే. పురం, చైతన్యపురి, మారుతీనగర్, కొత్త పేట్, చిల్కనగర్, ఉప్పల్ ప్రాంతాలు మరియు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్. కాబట్టి నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదదవండి : ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం.. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఇద్దరేసి డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు..!