New Year 2026: న్యూ ఇయర్ వేళ అందరికీ అలర్ట్.. ఈ ఒక్క తప్పు చేశారంటే మీ కొంప కొల్లేరే..

న్యూ ఇయర్ ఆఫర్స్ అంటూ మీకు ఏదైనా మెస్సేజ్ వచ్చిందా..? హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఏదైనా లింక్ వచ్చిందా..? ఇలాంటి మెస్సేజ్‌లు మీకు వస్తే జాగ్రత్త పడాల్సిందే. లేకపోతే మీరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటారు. దీని నుంచి తప్పించుకోవాలంటే ఈ జాాగ్రత్తలు పాటించండి.

New Year 2026: న్యూ ఇయర్ వేళ అందరికీ అలర్ట్.. ఈ ఒక్క తప్పు చేశారంటే మీ కొంప కొల్లేరే..
Cyber Security

Updated on: Dec 29, 2025 | 6:38 PM

ప్రజలను మోసగించి డబ్బలును కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త పద్దతులను ఉపయోగించుకుంటున్నారు. తెలివితో ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వీరి వలలో పడి దేశవ్యాప్తంగా లక్షల మంది మోసపోతున్నారు. విద్యావంతులు కూడా వీళ్ల బుట్టలో పడి డబ్బులను పొగోట్టుకుంటున్నారు. ప్రస్తుతం పండగుల సీజన్ మొదలు కావడంతో.. వీటిని తమకు అనుకూలంగా సైబర్ క్రిమినల్స్ మార్చుకుంటున్నారు. ప్రస్తుతం నూతన సంవత్సరం వస్తుండటంతో ప్రజలను మోసం చేసేందుకు దీనిని ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. న్యూ ఇయర్ గ్రీటింగ్స్, న్యూ ఇయర్ ఆఫర్ల పేరుతో నకిలీ లింక్‌లు సృష్టించి మోసాలకు పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణ పోలీసుల హెచ్చరిక

న్యూ ఇయర్ వేళ సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. న్యూ ఇయర్ వేళ ప్రజలను మోసగించేందుకు సైబర్ క్రిమినల్స్ ఇప్పటికే రంగం సిద్దం చేసుకున్నారు. ఇందుకోసం నయా ట్రిక్స్ పాటిస్తున్నారు. న్యూ ఇయర్ గ్రీటింగ్స్, హ్యాపీ న్యూయర్ లింక్స్ పేరుతో డబ్బులు కొట్టేసే ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్‌లో ఇలాంటి లింక్‌లు కనిపిస్తే అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాగే న్యూ ఇయర్ ఆఫర్లు, గిఫ్ట్స్, క్రెడిట్ కార్డు ఆఫర్లు అంటూ ఏవైనా లింక్‌లు కనిపిస్తే వాటిని క్లిక్ చేసేందుము నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ వాటిని క్లిక్ చేసే మీరు చిక్కుల్లో పడొచ్చని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఒకవేళ క్లిక్ చేస్తే

నకిలీ లింక్‌లను క్లిక్ చేస్తే వెంటనే మీ ఫోన్‌లోకి మాలిషస్ యాప్ ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అవుతుంది. దీని ద్వారా మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీలు, బ్యాంక్ వివరాలు అన్నీ సైబర్ నేరగాళ్లు యాక్సెస్ చేస్తారు. అలాగే మీ వాట్సప్ అకౌంట్‌ను హ్యాక్ చేసి వ్యక్తిగత వివరాలు అన్నీ చోరీ చేస్తారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి నకిలీ లింక్‌లను తెలియక క్లిక్ చేసి ఉంటే వెంటనే ఫోన్‌లో ఇంటర్నెట్‌ను ఆఫ్ చేసి పోలీసులను ఆశ్రయించాలి. అలాగే ఫోన్లో ఏదైనా అనుమానాస్పద యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచనలు జారీ చేశారు.