Cyber Crime: మీకు ఇలాంటి ఫోన్ కాల్స్‌ వస్తున్నాయా..? ఈ నెంబర్లకు సమాచారం అందించండి: సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

|

Mar 29, 2021 | 11:18 AM

Cyber Crime: హైదరాబాద్‌ నగరంలో రోజురోజుకు సైబర్‌ క్రైమ్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. నేరాలను అరికట్టేందుకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఎన్నో చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే..

Cyber Crime: మీకు ఇలాంటి ఫోన్ కాల్స్‌ వస్తున్నాయా..? ఈ నెంబర్లకు సమాచారం అందించండి: సైబర్‌ క్రైమ్‌ పోలీసులు
Cyber Crime Helpline
Follow us on

Cyber Crime: హైదరాబాద్‌ నగరంలో రోజురోజుకు సైబర్‌ క్రైమ్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. నేరాలను అరికట్టేందుకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఎన్నో చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠాలను సైతం పోలీసులు గుట్టురట్టు చేస్తున్నారు. చాలా మందికి ఫోన్‌లు చేస్తూ, మెసేజ్‌లు పంపుతూ అమాయకులను నట్టెట ముంచుతున్నారు. అమాయకులను ఆసరా చేసుకుని ఈ ముఠా సభ్యులు బ్యాంకుల విషయంలోనూ, రుణాల విషయంలోనూ ఇతర వాటి గురించి ఫోన్లు చేస్తూ నిలువునా మోసం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఇలాంటి సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి లక్షలు, కోట్లు పోగొట్టుకున్న సందర్భంగాలు చాలా ఉన్నాయి. తీరా మోసపోయిన తర్వాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రంగంలోకి దిగి నిఘా పెట్టారు.

మీకు ఇలాంటి ఫోన్లు వస్తున్నాయా…?

మీకు బహుమతి వచ్చిందనో, ఓఎల్‌ఎక్స్‌ లేదా ఇతర పోర్టల్‌లో పెట్టిన వస్తువులను కొంటామని, లేదా జాబ్‌లో మీరు ఎంపికయ్యారు.. రిజిస్ట్రేషన్‌ ఫీజు, ఇంటర్వ్యూ ఫీజు కట్టాలి.. అంటూ, అలాగే మీ డెబిట్‌ కార్డు బ్లాక్‌ అయింది.. మీ కార్డు అన్‌బ్లా్‌ కావాలంటే దాని నెంబర్లు, ఓటీపీలు చెప్పాలంటూ ఇలా రకరకాలుగా ఫోన్‌లు చేస్తున్నట్లయితే వెంటనే తమకు సమాచారం అందించాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కోరుతున్నారు. ఫిర్యాదులు చేసేందుకు పోలీసులు ఫోన్‌ నెంబర్లు కూడా ఇచ్చారు. ఇలాంటి అపరిచితుల నుంచి ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్లయితే తమకు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. ఇలాంటి వారు ఫోన్‌లు చేసినట్లయితే నిజామా..? కాదా..? అని తెలుసుకోవాలంటే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.

ఫోన్‌ చేయాల్సిన నెంబర్లు:

9490617310 (ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు)
040-27854031 (ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు)

Cyber Crime Helpline 1

ఇవీ చదవండి:

నాన్నా.. త్వరగా రండి.. నన్ను బయటకు తీయండి.. బస్సు చక్రాల కింద నలిగి.. చికిత్స పొందుతూ మృతి

Criminal Encounter: తప్పించుకున్న 72 గంటల్లోనే పోలీసుల చేతుల్లో ఎన్‌కౌంటర్‌ అయిన కరుడుగట్టిన నేరగాడు

AP Crime News: మహిళల పొదుపు నిధులను మింగేశారు.. ఏకంగా కోటి 75లక్షలు కాజేశారు…!