AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అబ్బా.. లచ్చిందేవి.. లచ్చిందేవి.. ATM నుంచి నోట్ల వర్షం.. పండగ చేసుకున్న జనం

హైదరాబాద్‌లో ఓ ఏటీఎం మిషన్ నోట్ల వర్షం కురిపించింది. అడిగినదాని కంటే ఎక్కవ క్యాష్ రిలీజ్ చేసింది. దీంతో.. ప్రజలు పెద్దయెత్తున ఏటీఎం ముందు బారులు తీరారు. డబ్బులు డ్రా చేసేందుకు ఎగబడ్డారు. దీంతో పోలీసులు యాక్షన్‌లోకి దిగి జనాన్ని చెదరగొట్టారు.

Hyderabad: అబ్బా.. లచ్చిందేవి.. లచ్చిందేవి.. ATM నుంచి నోట్ల వర్షం.. పండగ చేసుకున్న జనం
ATM Machine
Ram Naramaneni
|

Updated on: May 18, 2025 | 12:24 PM

Share

మే 17, శనివారం రాత్రి  పాతబస్తీలోని యాకుత్‌పురాలోని ఒక ఏటీఎం కేంద్రంలో నగదు వర్షం కురిసింది. ఏటీఎం నుంచి నగదు వర్షం కురవడం ఏంటి అనుకుంటున్నారా..? సదరు ఏటీఎం మెషీన్ మనం టైప్ చేసిన నగదు కంటే ఎక్కువ సొమ్మును బయటకు పంపింది. మొయిన్‌బాగ్‌లోని అన్మోల్ హోటల్ సమీపంలోని ఒక ఏటీఎం నుంచి ఇలా క్యాష్ ఓవర్ ప్లో అయింది. దీంతో నగదును విత్ డ్రా చేసిన వ్యక్తులు ఆశ్చర్యపోయారు. స్థానిక నివాసితులు అయిన ఇద్దరు వ్యక్తులు రూ. 3,000 విత్ డ్రే చేయాలని ప్రయత్నించారు. అయితే ఆశ్చర్యకరంగా యంత్రం ఒక్కొక్కరికి రూ. 4,000 ఇచ్చింది. వారు లావాదేవీ హిస్టరీని క్రాస్ చెక్ చేయగా.. ఖాతా నుంచి రూ. 3,000 డెబిట్ అయినట్లు వారికి SMS వచ్చింది.

విషయం తెలియడంతో స్థానికంగా ఉన్న కొందరు ATM సెంటర్ వద్దకు వచ్చి తమ లక్ టెస్ట్ చేసుకున్నారు. వారిని కూడా లచ్చిందేవి కరుణించింది. ఏటీఎం యంత్రం అడిగినదాని కంటే ఎక్కువ నగదు ఇస్తున్నట్లు అందరికీ అర్థమైంది. వార్త చక్కర్లు కొట్టడంతో.. ప్రజలు ఈ ఏటీఎం  కేంద్రానికి పరుగులు తీశారు. ఒక వ్యక్తి తాను రూ. 1500 డ్రా చేశానని, కానీ మెషీన్ నుంచి రూ. 1800 వచ్చినట్లు తెలిపాడు.

అక్కడ జనం గుమికూడటంతో… స్థానికుడు పోలీసులకు సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకుని జనసమూహాన్ని చెదరగొట్టారు. తరువాత పోలీసులు ఏటీఎం కేంద్రం షట్టర్‌ను దించి తాళం వేశారు. బ్యాంకు అధికారులకు కూడా సమాచారం అందించారు. యంత్రంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తి ఉండవచ్చని, దాని కారణంగా అదనపు మొత్తం పంపిణీ చేయబడుతోందని బ్యాంకు అధికారులు పోలీసులకు తెలిపారు. ఆ తర్వాత పోలీసులు ఏటీఎం సెంటర్ వద్ద పికెట్ ఏర్పాటు చేసి, ఆ ప్రదేశంలో ప్రజలు గుమిగూడకుండా నిరోధించారు. తరువాత బ్యాంకు అధికారులు రాత్రికి వచ్చి సమస్యను సరిచేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.