Safe Ride Challenge: స్టాలిన్ సినిమా తరహాలో వాహనదారులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ సరికొత్త ఛాలెంజ్

హైదరాబాద్‌ కొత్త సీపీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్ పోలిసింగ్‌లో తన మార్క్‌ను చూపిస్తున్నారు. జనాల్లో బాధ్యతాయుత డ్రైవింగ్ అలవాట్లను ప్రోత్సహించే లక్ష్యంతో సీపీ సజ్జనార్ సేఫ్‌రైడ్‌ (SafeRideChallenge) ఛాలెంజ్‌ అనే సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క పౌరుడు భాగం కావాలని పిలుపునిచ్చారు.

Safe Ride Challenge: స్టాలిన్ సినిమా తరహాలో వాహనదారులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ సరికొత్త ఛాలెంజ్
Safe Ride Challenge

Updated on: Oct 13, 2025 | 12:10 PM

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా నాలుగేళ్లు సేవలందించిన వీసీ సజ్జనార్ ఇటీవల హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. వచ్చిరాగానే పోలిసింగ్‌ విధానంలో ఆయన తన మార్క్‌ను చూపిస్తున్నారు. ప్రజల్లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపుడుతున్నారు. ఇందులో భాగంగానే వాహనదారుల్లో బాధ్యతాయుత డ్రైవింగ్ అలవాట్లను ప్రోత్సహించే లక్ష్యంతో సేఫ్‌రైడ్ ఛాలెంజ్ అనే సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాహనదారులు ప్రయాణం స్టార్ట్ చేసే ముందు హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ కట్టుకోవడం వంటి భద్రతా చర్యలను పాటిస్తూ ఒక చిన్న వీడియో లేదా ఫోటో తీసి, తన ముగ్గురు స్నేహితులను లేదా కుటుంబ సభ్యులను ట్యాగ్ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయాలని చెప్పుకొచ్చారు.

ఇలా చేయడం ద్వారా అతిగా సోషల్ మీడియా ఉపయోగించే యువతలో మార్పు తీసుకురావచ్చని.. వారికి రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన తేవొచ్చని తెలిపారు. సేఫ్టీ ఎప్పుడూ ఫ్యాషన్ అవుట్ కాదు..మీ ప్రతి ప్రయాణం మిమ్మల్ని, మీకు ఇష్టమైన వారిని రక్షించుకునే నిర్ణయంతో మొదలవుతుంది ఆయన రాసుకొచ్చారు.ఈ కార్యక్రమంలో వాహనాలు నడిపే ప్రతి ఒక్క పౌరుడు పాల్గొనాలని మనం అందరం కలిసి సేఫ్టీని 2025లో కూలెస్ట్ ట్రెండ్‌గా మార్చుదాం అని ఆయన పిలుపునిచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.