Hyderabad City police: అనవసరంగా హారన్ కొట్టొద్దు.. ఫన్నీ ట్వీట్ చేసిన హైదరాబాద్ పోలీసులు..

|

Sep 29, 2021 | 3:31 PM

ఎదైనా ప్రజల్లోకి వెళ్లాలంటే వినూత్నంగా ఆలోచించాలి.. అలా చేస్తేనే అది ప్రజల్లోకి వెళ్తోంది. ఇది ప్రస్తుతం ఉన్న ట్రెండ్. ఈ ట్రెడ్‎కు...

Hyderabad City police: అనవసరంగా హారన్ కొట్టొద్దు.. ఫన్నీ ట్వీట్ చేసిన హైదరాబాద్ పోలీసులు..
Auto
Follow us on

ఎదైనా ప్రజల్లోకి వెళ్లాలంటే వినూత్నంగా ఆలోచించాలి.. అలా చేస్తేనే అది ప్రజల్లోకి వెళ్తోంది. ఇది ప్రస్తుతం ఉన్న ట్రెండ్. ఈ ట్రెడ్‎కు తగ్గట్లే హైదరాబాద్ పోలీసులు వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో దూసుకెళ్లే విధంగా పోస్ట్ చేస్తున్నారు. సుత్తి లేకుండా సూటిగా.. ట్రెండీగా.. క్యాచీగా.. టీజింగ్‎గా​ ఉంటూనే.. వాళ్లు చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి.. నేటి తరం యువతకు సందేశాన్ని ఇవ్వడానికి ట్విటర్‎​ను వినియోగిస్తున్నారు. యువతను ఆకట్టుకునేలా.. వారికి అర్థమయ్యేలా మీమ్స్ పోస్టు చేస్తూ విషయమేంటో చెప్పేస్తున్నారు. ఇప్పటికే ఇలా చాలా మీమ్స్‎తో ప్రజల్లో ట్రాఫిక్​, ఇతర విషయాలపై అవగాహన కల్పించారు.

గత కొద్దిరోజులుగా సోషల్‌ మీడియా జపం చేస్తున్న పదం ‘‘సుఖీభవ.. సుఖీభవ.’’ ఏ మీమ్‌ చూసినా ఇదే మాట అందరి నోట వినిపిస్తుంది. ఓ ‘టీ’ యాడ్‌లో బామ్మ ఒకరికి టీ ఇచ్చినందుకు గానూ ఆశీర్వదిస్తూ చెప్పే మాటే ‘సుఖీభవ’. కట్‌ చేస్తే ఆ టీ పొడి యాడ్‌ను రీక్రీయేట్‌ చేశారు. గణేశ్‌ నిమజ్జనం రోజు ‘‘అయ్యోయ్యో.. వద్దమ్మా సుఖీభవ! సుఖీభవ!’’ అంటూ చిందులేయడం కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అప్పటి నుంచి దీని మీద లెక్కలేనన్ని మీమ్స్‌, వీడియోస్‌ పుట్టుకొచ్చాయి. ఇదీ ప్రజల్లోకి బాగా వెళ్తుందని గమనించిన హైదరాబాద్ సిటీ పోలీసులు అదిరిపోయే మీమ్స్ తయారు చేశారు. సైబర్‌ మోసాలకు పాల్పడే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సుఖీభవ స్టైల్‌లో హెచ్చరిస్తూ ఓ మీమ్‌ను ట్వీట్‌ చేశారు.

తాజాగా ఓ ఆటో వెనక భాగం ఫొటోను ట్విట్టర్‎లో పోస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇంతకీ ఆటో వెనక భాగంలో ఏం రాసి ఉంది అంటే.. నాకు పెళ్లి అయింది డిస్టర్బ్ చేయకు.. ఎందుకంటే నేను ఇప్పటికే డిస్టర్బ్ అయి ఉన్న అని రాసి ఉంది. పోలీసులు ఈ ఫొటోను పోస్టు చేస్తూ “అనవసరంగా హారన్ కొట్టకు.. అదిడిస్టర్బ్” అవుతుందని రాసుకొచ్చారు. ఈ పోస్టు ఇప్పుడు వైరల్‎గా మారింది.

 

 

Read Also.. Maratorium on booster dose: బూస్టర్ డోసుపై మారటోరియం.. ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ తాజా సూచన.. ఆచరణ సాధ్యమేనా..?