Hyderabad Meat Shops: హైదరాబాద్ లో నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఈ ఆదివారం మాంసం దుకాణాల బంద్.. కారణం అదేనా..?

మహావీర్‌ జయంతి సందర్భంగా ఆదివారం గ్రేటర్‌ పరిధిలో కబేళాలు, మాంసం, బీఫ్‌ దుకాణాలు బంద్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

Hyderabad Meat Shops: హైదరాబాద్ లో నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఈ ఆదివారం మాంసం దుకాణాల బంద్.. కారణం అదేనా..?

Updated on: Apr 23, 2021 | 11:30 AM

Hyderabad Meat Shops: ఆదివారం వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో నాన్ వెజ్ ప్రియులు మాంసం దుకాణాల ముందు క్యూ కడుతుంటారు. రోజు వారీ కూలి చేసుకునే కుటుంబం అయినా సరే, ఆదివారం నాడు మాంసం ముద్ద తినేందుకు ఆరాటపడుతుంటారు. ఎంతో కొంత చికెన్, మటన్ ను ఇంటికి తీసుకెళ్లి వండించి కుటుంబమంతా ఆరగిస్తుంటారు మాంసం ప్రియులు మాత్రం ప్రతీ ఆదివారం ముక్క రుచి చూడనిదే అస్సలు ఉండలేకపోతుంటారు

అయితే ఈ ఆదివారం మాత్రం హైదరాబాద్ లో నివసించే ప్రజలు మాంసాహారాన్ని రుచి చూడలేరు. మహావీర్‌ జయంతి సందర్భంగా ఆదివారం గ్రేటర్‌ పరిధిలో కబేళాలు, మాంసం, బీఫ్‌ దుకాణాలు బంద్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. నిబంధనలు అందరూ పాటించేలా చర్యలు తీసుకోవాలని వెటర్నరీ విభాగం అధికారులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తిరిగి సోమవారం యథావిధిగా కబేళాలు తెరుచుకోవచ్చని కమిషనర్ పేర్కొన్నారు.

Read Also… Telangana Corona Cases: తెలంగాణలో కరోనా విలయ తాండవం.. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు.. కొత్తగా 6,206 మందికి పాజిటివ్