
వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతున్న వ్యాధులపై పరిశోధకులు కీలక పరిశోధనలు చేస్తున్నాయి. ఇక ప్రమాదకరమైన వ్యాధులలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. దీనిపై పరిశోధనలో హైదరాబాద్‌లోని సీసీఎంబీ కీలక పురోగతి సాధించింది. చుక్క రక్తంతో రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించే ఖచ్చితమైన బయోమార్కర్లను గుర్తించింది సీసీఎంబీ. క్లినికల్ ట్రయల్స్, ఇతర పరిశోధనల తర్వాత ల్యాబ్ ఆన్ చిప్‌గా డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.సీసీఎంబీలోని క్యాన్సర్ బయాలజీ శాస్త్రవేత్త లేఖ దినేశ్ కుమార్ బృందం చేపట్టిన రీసెర్చ్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
మహిళలకు ఇదొక వరం..
అయితే దీనిపై పరిశోధనలలో భాగంగా రొమ్ములోని కణజాలాన్ని సేకరించిన శాస్త్రవేత్తలు.. బయాప్సీ పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలతో చేపట్టిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలను సరిపోల్చారు. అయితే రెండింటిలోనూ ఒకేరకమైన ఫలితాలు వచ్చినట్లు పరిశోధనలో వెల్లడైంది. మరింత సమాచారం కోసం క్లినికల్ ట్రయల్స్ అవసరం అని పరిశోధకులు చెబుతున్నారు. ఎప్పుడైనా సరే వేలి కొనపై ఒక్క రక్తపు చుక్కతో షుగర్ లెవల్స్ తెలుసుకుంటున్నామో..అలాగే ఈ రొమ్ము క్యాన్సర్ గురించి తెలుసుకోవచ్చంటున్నారు. ల్యాబ్ ఆన్ చిప్‌గా అభివృద్ధి చేస్తే చేస్తే మన దేశంలోని మహిళలకు ఒక వరమని పరిశోధకులు అంటున్నారు.
పరిశోధనలో సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) పరిశోధకులు వినోద్‌కుమార్‌వర్మ, సయ్యద్ సుల్తాన్, కుమార్, రవికిరణ్, తిరువనంతపురంలోని రీజినల్ క్యాన్సర్ సెంటర్‌కు చెందిన రేఖ ఏ నాయక్, లిజా ఎక్తర్ అలెగ్జాండర్ విషయాలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన పరిశోధన వివరాలు సెల్ కమ్యూనికేషన్ అండ్ సిగ్నలింగ్ జర్నల్‌లో పత్రం ప్రచురితమైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి