Hyderabad: సెల్ఫ్‌ మర్డర్‌కు ‘అతడు’ మువీ స్టైల్లో స్కెచ్‌.. కథఅడ్డం తిరగడంలో కటకటాల పాలైన BJP నేత

|

Mar 01, 2024 | 2:02 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మువీ 'అతడు' గుర్తుందా..? సీఎం పదవి కోసం పొటిలికల్ లీడర్ వేసిన సెల్ఫ్ మర్డర్ ప్లాన్ చూట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రతిపక్ష నాయకుడు శివా రెడ్డి (షయాజీ షిండే) తనపై మర్డర్ అటెంప్ట్ జరగాలి. కానీ తాను చనిపోకూడదు. ఇలా చేస్తే ప్రజల సానుభూతి ఓట్లు వస్తాయంటూ ఎన్నికల్లో గెలవడానికి తన అనుచరుడు..

Hyderabad: సెల్ఫ్‌ మర్డర్‌కు అతడు మువీ స్టైల్లో స్కెచ్‌.. కథఅడ్డం తిరగడంలో కటకటాల పాలైన BJP నేత
BJP Leader Uday Bhaskar Goud
Follow us on

హైదరాబాద్, మార్చి 1: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మువీ ‘అతడు’ గుర్తుందా..? సీఎం పదవి కోసం పొటిలికల్ లీడర్ వేసిన సెల్ఫ్ మర్డర్ ప్లాన్ చూట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రతిపక్ష నాయకుడు శివా రెడ్డి (షయాజీ షిండే) తనపై మర్డర్ అటెంప్ట్ జరగాలి. కానీ తాను చనిపోకూడదు. ఇలా చేస్తే ప్రజల సానుభూతి ఓట్లు వస్తాయంటూ ఎన్నికల్లో గెలవడానికి తన అనుచరుడు బాజి రెడ్డి (కోట శ్రీనివాసరావు), మరో స్నేహితుడు ఫరూక్ (పోసాని కృష్ణమురళి)తో కలిసి ఓ పథకం వేస్తాడు. అయితే బాజి రెడ్డి ప్లాన్‌ మార్చేసి శివా రెడ్డిని పక్కా ప్లాన్‌తో మర్డర్‌ చేయిస్తాడు. ట్విస్టులతో సాగే ఈ మువీ అప్పట్లో పెద్ద హిట్‌ సాధించింది. అయితే.. అచ్చం ఈ మువీలో మాదిరి రియల్‌ లైఫ్‌లో కూడా నగరానికి చెందిన ఓ బీజేపీ యువ నేత సెల్ఫ్‌ మర్డర్‌ ప్లాన్‌ చేస్తాడు. సినిమా ప్రొడ్యూసర్‌ కమ్‌ బీజేపీ నేత వేసిన ఈ సినిమాథిటిక్‌ సెల్ఫ్ మర్డర్ ప్లాన్ అసలుకే ఎసరు తెచ్చింది. దీంతో ఊహించని రీతిలో చిక్కుల్లో ఇరుక్కున్నాడు. అసలింతకీ ఏం జరిగిందంటే..

జాతీయ హిందూ ప్రచార కమిటీ సభ్యులు, బీజేపీ రాష్ట్ర స్వచ్ఛభారత్ అభియాన్ కన్వీనర్, సినిమా ప్రొడ్యూర్‌ అయిన ఉదయ్ భాస్కర్ గౌడ్‌పై గత నెల (ఫిబ్రవరి) 24న గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో శరీరంపై కత్తి పోట్లతో ఉదయ్ భాస్కర్ గౌడ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి హుటాహుటీన తరలించారు. ఈ క్రమంలో తనపై హత్యా ప్రయత్నం జరిగిందంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఉదయ్ భాస్కర్ గౌడ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రంగంలోకి దిగారు. బీజేపీ నేతపై జరిగిన దాడి గురించి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది.

అట్టర్‌ ప్లాఫ్‌ అయిన సెల్ఫ్‌ మర్డర్‌ ప్లాన్‌..

ఉదయ్ భాస్కర్‌పై జరిగిన హత్యా యత్నానికి అతనే సూత్రధారిగా పోలీసుల దర్యాప్తులో బయటపడింది. పక్కాగా తానే మర్డర్ ప్లాన్ వేసుకుని, తనపై తానే దాడి చేయించుకున్నట్టు తేయడంతో పోలీసులు అవాక్కయ్యారు. బోడుప్పల్‌లో నివాసం ఉంటున్న భాస్కర్ గౌడ్‌ సినీ నిర్మాతగా, బీజేపీ నేతగా మంచి పలుకుబడి సంపాదించుకున్నాడు. ఇప్పటికే సమాజంలో భాస్కర్‌కు కొంత పరపతి ఉండటంతో దానిని మరింత పెంచుకోవాలని భాస్కర్ గౌడ్ భావించారు. పరపతి పెరిగి, తన వెంట ఇద్దరు గన్‌మెన్లు ఉంటే అందరూ తనను గౌరవిస్తారని అనుకున్నాడు. అయితే గన్‌మెన్లకు పొందాలంటే తనకు ప్రాణహాని ఉన్నట్టు సీన్‌ క్రియేట్ చేస్తే.. పోలీసులే స్వయంగా గన్‌మెన్లతో సెక్యురిటీ ఇస్తారని భావించాడు. స్వతహాగా సినీరంగంలో ప్రమేయం ఉండటంతో అతడు సినిమా రేంజ్‌లో సెల్ఫ్ మర్డర్ ప్లాన్ వేశాడు. పథకం ప్రకారం ఫిబ్రవరి 24న ఉప్పల్ భగాయత్‌లోమర్డర్ ప్లాన్‌ను అమలు చేశాడు. ఇందుకుగానూ భాస్కర్ గౌడ్‌ రూ. రెండున్నర లక్షల ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో జంటనగరాల్లోని పీఎస్‌లలో 7 కేసులు నమోదైనట్టు బయటపడింది. గన్‌మెన్ల కోసం ఆడిన ఉత్తుత్తి నాటకం బయటపడటంతో పోలీసులు భాస్కర్ గౌడ్‌తోపాటు మారో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్లాన్‌కు వినియోగించిన ఇన్నోవా వాహనం, రెండు ద్విచక్ర వాహనాలు, 2 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజిగిరి డీసీపీ పద్మజ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.