భాగ్యనగరాన్ని గతకొన్ని నెలలుగా బుల్డోజర్లు హడలెత్తిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో బుల్డోజర్ పేరు వింటే నగరవాసులు జంకుతున్నారు. లేటెస్ట్‌గా నటుడు బాలకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇళ్లకు మార్క్ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. బాలయ్య, జానారెడ్డి మాత్రమే కాదు.. అల్లు అర్జున్ మామతోపాటు పలువురు ప్రముఖుల నివాసాలు కూడా మార్క్ చేశారు. అసలింతకు అవి హైడ్రా మార్కింగ్సేనా..? మరేమైనా కారణాలున్నాయా..?
ఫిల్మ్‌నగర్‌లోని రోడ్ నంబర్ 45లో ఉన్న బాలకృష్ణ నివాసానికి మార్కింగ్ వేశారు అధికారులు. ఆయన నివాసంలో దాదాపు ఆరు అడుగుల మేర మార్క్ చేశారు. ఇటు జానారెడ్డి ఇంటి కాంపౌండ్‌కు కూడా మార్క్ చేసి వెళ్లారు. అయితే ఈ హైడ్రా మార్కింగ్స్ కానే కావు.. వీళ్లవి అక్రమ నిర్మాణాలు అంతకన్నా కాదు. కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం ఆరు జంక్షన్లలో ఆరు అండర్ పాస్‌లు, ఎనిమిది చోట్ల స్టీల్ బ్రిడ్జిలను నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగానే కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న పలు నివాసాలకు అలాగే షాపులకు మార్క్ చేశారు అధికారులు.
అందులో జానారెడ్డి, బాలకృష్ణ ఇళ్లు కూడా ఉన్నాయ్. ఏడాదిన్నరలో బ్రిడ్జ్‌లు, అండర్‌పాస్‌ల నిర్మాణాలను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్న సర్కార్.. పనులను స్పీడప్ చేసింది. కేబీఆర్ పార్క్ చుట్టూ జుబ్లీహిల్స్ చెక్ పోస్టు, రోడ్డు నెంబర్ 45, ఫిలింనగర్, మహారాజ్ అగ్రసేన్ సర్కిల్, క్యాన్సర్ హాస్పిటల్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు రానున్నాయి. అందుకు దాదాపు 12వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి