హైదరాబాద్(Hyderabad) నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో(Nampally Exhibition Grounds) శుక్రవారం నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(Annual trade fair) నుమాయిష్(Numaish) పునః ప్రారంభమైంది. కరోనా తీవ్రత కారణంగా వాయిదా పడ్డ ఎగ్జిబిషన్ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. 46 రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శన ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి పదిన్నర దాకా ఉంటుంది. దీనికి వచ్చే సందర్శకుల తాకిడి నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ నగర పోలీసులు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఇవి అమలులో ఉంటాయి. సెలవు రోజుల్లో రాత్రి 11 గంటల వరకూ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. నుమాయిష్‌లో దాదాపు 16 వందల స్టాల్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో గత 81 ఏళ్లుగా నిరాటకంగా కొనసాగుతోంది అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన.. జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు జరగాల్సిన ఈ ఎగ్జిబిషన్ కరోనా తీవ్రత కారణంగా వాయిదా పడి కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది.
గత ఏడాది కూడా నిర్వహించకపోవడంతో ఈసారి అందరూ నగర ప్రజలు ఎప్పుడెప్పుడు ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తూ వచ్చారు.. సందర్శకులు కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు అధికారులు. మాస్క్, శానిటైజేషన్, థర్మల్ స్ర్కీనింగ్ తర్వాతే ఎగ్జిబిషన్‌కు అనుమతినిస్తారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
ఎస్‌ఏ బజార్, జామ్‌బాగ్‌ల వైపు నుంచి ఎంజే మార్కెట్ మీదుగా నాంపల్లి వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, భారీ వాహనాలను ఎంజే మార్కెట్ నుంచి అబిడ్స్ మీదుగా మళ్లిస్తారు. పోలీసు కంట్రోల్ రూమ్, ఫతేమైదాన్ వైపు నుంచి నాంపల్లి, ఎంజే మార్కెట్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, భారీ వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు పంపిస్తారు.
ఇవి కూడా చదవండి: Russia Ukraine War: ఇంటర్నేషనల్ స్పేష్ స్టేషన్‌ను కూల్చేస్తాం.. యూరప్, అమెరికాలకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్..
Dental Care: దంతాలు పసుపురంగులో ఉన్నాయా..? అయితే ఈ ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలు తెల్లగా మారిసిపోతాయి..