Hyderabad Police: తగ్గేదేలే అంటే తాట తీస్తాం.. రౌడీషీటర్లకు హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక..

|

Jul 29, 2021 | 3:16 PM

Hyderabad police warn rowdy sheeters: రౌడీ షీటర్లు పెచ్చుమీరితే తాటతీస్తామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఎక్కడినుంచైనా రౌడీషీటర్లపై ఫిర్యాదులు

Hyderabad Police: తగ్గేదేలే అంటే తాట తీస్తాం.. రౌడీషీటర్లకు హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక..
Amber Peta Police
Follow us on

Hyderabad police warn rowdy sheeters: రౌడీ షీటర్లు పెచ్చుమీరితే తాటతీస్తామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఎక్కడినుంచైనా రౌడీషీటర్లపై ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పవంటూ పేర్కొన్నారు. రౌడీషీటర్లందరూ సత్ప్రవర్తనతో మెలగాలని.. లేకపోతే చర్యలు తప్పవని అంబర్ పేట్ ఇన్స్పెక్టర్ పేరం సుధాకర్ హెచ్చరించారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషనలో ఎస్ఐలతో కలిసి సీఐ సుధాకర్ రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

ఈ సందర్భంగా సీఐ సుధాకర్ మాట్లాడుతూ.. రౌడీషీటర్లు రాబోయే పండుగల సందర్భంగా ఇబ్బందులకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రౌడీషీటర్‌గా కేసు నమోదై ఉన్నవారు ఎక్కడికి వెళ్లినా, ఇళ్లు మారినా పోలీస్‌ స్టేషన్లలో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎక్కడైనా ఏ గొడవలో కూడా తలదూర్చకూడదంటూ పేర్కొన్నారు. రౌడీషీటర్లగా ఉంటే సమాజంలో చిన్నచూపు చూస్తారని.. గొడవలకు దూరంగా ఉంటూ సమాజంలో మంచిగా మెలగాలని సూచించారు. గొడవలు, రౌడీయిజం వల్ల కుటుంబానికి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. పిల్లలు, కుటుంబసభ్యులు ఇబ్బందులు పడకుండా సమాజంలో గౌరవంగా జీవించాలని సుధాకర్ సూచించారు.

కాగా.. ఇప్పటికే హైదరాబాద్ నగర ప్రాంతాల్లో లా అంట్ ఆర్డర్ సక్రమంగా ఉండేందుకు.. ఇప్పటికే పోలీసులు అన్ని ప్రాంతాల్లో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఎవరైనా హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు.

Also Read:

Telangana: సంచలనం.. తెలంగాణలోని ఆ మండలంలో ఒకే రోజు ముగ్గురు మహిళలు మిస్సింగ్

Jagadish Reddy Vs Komatireddy: వారివి చిల్లర రాజకీయాలు.. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్..