Rachakonda Commissionerate: వ్యభిచారం నిర్వహణ, మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న కురుమన కిషోర్ అనే వ్యక్తిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈ విషయాన్ని రాచకొండ కమిషనరేట్ సీపీ వెల్లడించారు. మార్చి 20వ తేదీన ఏహెచ్‌టీయూ బృందం కమిషనరేట్ పరిధిలోని జవహార్‌నగర్ పీఎస్ పరిధిలో మానవ అక్రమ రవాణా, వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. వ్యభిచార నిర్వాహకులు కురుమన కిషోర్ సహా సుజాత, మీనా అనే మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి చెరలోంచి మైనర్ బాలికకు విముక్తి కల్పించారు. గత ఆరు నెలలుగా మైనర్ బాలికచే పని మనిషి సాకుతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఉద్యోగం, జీవనోపాధి కల్పిస్తామని అమాయక యువతులను నమ్మించి.. వారిని వ్యభిచార రొంపిలోకి బలవంతంగా దించుతున్నట్లు గుర్తించారు.
కాగా, ఈ కేసులో కురుమన కిషోర్ ఇప్పటికే చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తుండగా.. ఇవాళ అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు రాచకొండక సీపీ ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, నిందితుల్లో ఒకరైన సుజాతపై ఇప్పటికే పీడీ యాక్ట్ నమోదు చేశారు. తాజాగా కిషోర్‌పై పీడీ యాక్ట్ పెట్టారు. మానవ అక్రమ రవాణా, వ్యభిచారం వంటి అసాంఘీక కార్యక్రమాలను నిరోధించే ఉద్దేశ్యంతో నిందితులపై పీడీ చట్టాన్ని ప్రయోగించడం జరిగిందని సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు.
Also read:
ICMR Survey: భారత్ లో 40 నుంచి 45 కోట్లమంది కరోనా బాధితులు..తేల్చి చెప్పిన ఐసీఎంఆర్ సీరో-సర్వే
IMF about Corona: కరోనా చాలా ఖరీదైనది.. దీని అంతానికి 364 లక్షల కోట్లు అవసరం అంటున్న ఐఎంఎఫ్