Smuggling: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా పట్టుబడిన బంగారం, యూఎస్ డాలర్లు.. లెక్క చూస్తే షాకే..

|

Mar 31, 2021 | 3:10 PM

Smuggling: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి శంషాబాద్..

Smuggling: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా పట్టుబడిన బంగారం, యూఎస్ డాలర్లు.. లెక్క చూస్తే షాకే..
Gold
Follow us on

Smuggling: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ ఐదుగురు ప్రయాణికులు కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. అందరు ప్రయాణికుల మాదిరిగానే వీరు కూడా దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా మిక్సర్ గ్రైండర్‌లోని కటింగ్ మిషన్‌లో బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చారు. అయితే వీరిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా.. బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. బంగారాన్ని మిక్సర్ గ్రైండర్ మోటార్లు, కట్టింగ్ ఉపకరణాలలో దాచడాన్ని గుర్తించారు. 2.5 కిలో బంగారాన్ని ఇలా రహస్యంగా తీసుకువచ్చారు. దీని విలువ రూ. 1.15 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. సదరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు.. వారిని విచారిస్తున్నారు.

ఈ ఘటన ఇలా ఉండగా.. విదేశీ మారక ద్రవ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ కస్టమ్స్, సీఐఎస్ఎఫ్ అధికారులు సయన్వయంగా పట్టుకున్నారు. ఎఫ్‌జెడ్ 8776 ద్వారా దుబాయ్‌కు బయలుదేరడానికి ప్రయత్నించిన ప్రయాణికుడి నుంచి అక్రమంగా తరలిస్తున్న విదేశీ మారక ద్రవ్యాన్ని పట్టుకున్నారు.

 

అతని వద్ద నుంచి 30,000 యూఎస్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. భారత కరెన్సీ రూపంలో దీని విలువ రూ. 21,48,000 లకు సమానంగా ఉంటుంది. కస్టమ్స్ యాక్ట్ కింద కరెన్సీని స్వాధీనం చేసుకున్న అధికారులు.. సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి అతనిపై కేసు నమోదు చేశారు.

Also read:

Rafale Fighter Jet: భారత్‌కు మరో మూడు రాఫెల్‌ యుద్ధ విమానాలు.. మరింత పటిష్టం కానున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్..

Kurnool District Collector Office: టెన్త్ క్వాలిఫికేషన్ తో కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగవకాశాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..!

Elections Commission: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా ఇదే చివరి రోజు.. కీలక వ్యాఖ్యలు చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్..