Hyderabad: గుడ్ న్యూస్.. పాతబస్తీ రుచులు ఇకపై రాత్రి 1 గంట వరకూ ఎంజాయ్ చేయవచ్చు

|

Sep 29, 2022 | 3:36 PM

ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల్లో రాత్రి 1 గంట వరకూ హోటళ్లు తెరుచుకునేలా పోలీసులు పర్మిషన్ ఇచ్చారని ఎంఐఎం నాయకులు తెలిపారు.

Hyderabad: గుడ్ న్యూస్.. పాతబస్తీ రుచులు ఇకపై రాత్రి 1 గంట వరకూ ఎంజాయ్ చేయవచ్చు
Old City Biryani
Follow us on

పాతబస్తీ రుచులు ఇకపై రాత్రి 1 గంట వరకూ ఎంజాయ్ చేయవచ్చు. పాతబస్తీ బిర్యానీ లేట్ నైట్ లోనూ తినొచ్చు. రాత్రి పూట పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో ఉన్న హోటళ్లలో బిర్యానీ సేల్స్ విపరీతంగా ఉంటాయి. దీంతో నిర్వాహకులు సమయం పొడిగించాలంటూ ఎంఐఎం నేతలను కలిశారు. ఓవైసీ సోదరుల ఆదేశాలతో మజ్లిస్ నాయకులు, కొంతమంది హోటల్‌ నిర్వహకులు సీపీని కలిసి వినతిపత్రం ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన సీపీ.. అర్ధరాత్రి 1 గంట వరకూ హోటళ్లు తెరుచుకునేలా అనుమతించారని, ఇవాళో రేపో అధికారిక ఆదేశాలను జారీ చేస్తామని హామీ ఇచ్చారని  నిర్వహకులు చెబుతున్నారు. ఇదలా ఉంటే అర్ధరాత్రి 1గంట వరకూ పర్మిషన్‌ అవసరం లేదని, 11గంటలకే బంద్‌ చేయాలంటూ ఓ వ్యక్తి హోం మంత్రికి ఫోన్‌ చేశాడు. అంతేకాదు ఎన్నిగంటలకు బంద్‌ చేయిస్తారంటూ ప్రశ్నించాడు. అర్ధరాత్రి ఫోన్‌ చేయడంపై మహమూద్‌ అలీ మండిపడ్డారు.

గత కొంత కాలంగా రాత్రి 11 గంటలకు హోటళ్లు బంద్‌ చేయకపోతే చర్యలు తీసుకునేవారు పోలీసులు. 1, 2సార్లు చలాన్లు రాసేవారు.. ఆ తరువాత మాట వినకపోతే సీరియస్‌ యాక్షన్‌ తీసుకుని జైలుకు పంపేవారు. దీంతో పాతబస్తీ హోటల్ నిర్వాహకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘వారి కష్టాలను పార్టీ దృష్టికి తీసెకెళ్లాం. అధిష్ఠానం స్పందించి.. పోలీసులతో చర్చించింది. సీపీ పాజిటివ్‌గా స్పందించినందుకు ధన్యవాదాలు’ అని చెప్పారు యాకుత్‌పుర ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి‌.. హోటల్స్‌ అర్ధరాత్రి 1 గంట వరకూ తెరిచి ఉంచేలా సీపీ ఆదేశాలు ఇస్తామని చెప్పారన్నారు. ఇకపై హైదరాబాద్‌ పాతబస్తీలో అర్ధరాత్రి 1గంట వరకూ హోటళ్లు తెరిచే ఉంటాయి. ఇక హైదరాబాద్‌ రుచులను అర్ధరాత్రి వరకూ ఆస్వాదించవచ్చు.

అయితే పోలీసులు పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఆంక్షలు ఉండనున్నాయి. తాగి న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు పోలీసులు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే.. తోలు తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. హైదారాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ దెబ్బ తీస్తే ఊరుకోమని హెచ్చరించారు. అక్కడి వ్యాపారులు కూడా శాంతిభద్రతలు కాపాడటంలో సహకరించాలన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం