ORR టెండర్‌ చుట్టూ తెలంగాణ రాజకీయ దుమారం.. భారీ స్కామ్ జరిగిందని విపక్షాల ఆరోపణ..

|

May 03, 2023 | 8:15 PM

ఔటర్‌ రింగ్ రోడ్డు టెండర్‌ చుట్టూ రాజకీయ దుమారం కొనసాగుతోంది. భారీ స్కామ్ జరిగిందని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. తప్పుడు ఆరోపణలతో రాజకీయం చేస్తున్నాయంటూ కౌంటర్ ఇస్తోంది BRS. అటు ఈ టెండర్‌ను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారమే కేటాయించామని స్పష్టత ఇచ్చారు మున్సిపల్ శాఖ స్పెషల్ CS అరవింద్‌కుమార్..

ORR టెండర్‌ చుట్టూ తెలంగాణ రాజకీయ దుమారం.. భారీ స్కామ్ జరిగిందని విపక్షాల ఆరోపణ..
Outer Ring Road
Follow us on

ఇటీవల ORRను 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది ప్రభుత్వం. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ డెవలపర్స్‌ అనే సంస్థ ఈ టెండర్‌ను దక్కించుకుంది. అయితే ఈ ఎపిసోడ్‌లో భారీ స్కామ్‌ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై మున్సిపల్ శాఖ స్పెషల్‌ CS అరవింద్‌ కుమార్‌ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. NHAI నిబంధనల ప్రకారమే ORR టెండర్లు పిలిచామని స్పష్టం చేశారు. 30 ఏళ్ల లీజు తప్పనిసరేం కాదని.. ప్రతి 10ఏళ్లకు ఓసారి రివ్యూ చేస్తామని చెప్పారు అరవింద్‌కుమార్.

బేస్‌ ప్రైస్‌ ఎందుకు నిర్ణయించలేదన్న విమర్శలకు కూడా సమాధానం ఇచ్చారు అరవింద్ కుమార్. బేస్ ప్రైస్‌ను ముందుగా ఫిక్స్ చేసిన తర్వాతే టెండర్లకు వెళ్లామని స్పష్టం చేశారు. అయితే ఆ మొత్తం ఎంత అనేది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా కూడా ముందుగానే చెప్పడం లేదని.. తాము కూడా అదే పద్ధతిని ఫాలో అయ్యామని తెలిపారు అరవింద్ కుమార్. అటు ORR టెండర్‌ దక్కించున్న ఐఆర్‌బీ సంస్థ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ DGP ఆఫీస్‌లో ఫిర్యాదు చేశారు BJP MLA రఘునందన్ రావు.

ORR టెండర్లలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ కూడా ఆరోపిస్తోంది. RTI కింద వివరాలు అడిగితే ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీస్తోంది. ఉనికి కోసమే తప్పుడు ఆరోపణలతో డ్రామాలు చేస్తున్నారంటూ విపక్షాల ఆరోపణలను తిప్పికొడుతోంది BRS.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం