
నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ తెగ ఊరిస్తున్నారు కిర్రాక్ ఆర్పీ. ఈ కమెడియన్ పెట్టిన కర్రీ పాయింట్‌కు మంచిగానే డిమాండ్ పెరిగింది. అయితే ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడంతో.. చెఫ్‌ల కొరత ఏర్పడి.. కొన్నాళ్లు దుకాణం బంద్ చేశాడు. ఆపై తన నెల్లూరు వెళ్లి.. అక్కడ చేపల పులుసు వండటంలో చేయి తిరగినవారిని తీసుకుని.. మళ్లీ రీ ఓపెన్ చేశాడు. డిమాండ్‌కి తగ్గట్లుగా కిచెన్ కెపాసిటీ పెంచేశాడు. ప్రజంట్ అయితే కూకట్‌పల్లిలో బ్రాంచ్ నడుస్తుంది. జనాలు గట్టిగానే అక్కడికి వెళ్తున్నాడు. నెల్లూరు స్లైల్లో మామిడికాయ వేసి.. పులుసు చేయిస్తున్నాడు ఆర్పీ. చేపలు కూడా దాదాపు అక్కడి నుంచే తెప్పిస్తున్నాడు. సన్న చేపల పులుసు, కొరమీను పులుసు, బొమ్మిడాయిల పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు అతని వద్ద అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో.. ఈ చేపల పులుసే ట్రెండింగ్.
పలు యూట్యూబ్ చానళ్లు మోత మెగిస్తున్నాయి ఆర్పీ పెట్టిన ఈ కర్రీ పాయింట్ గురించి. దీంతో గట్టిగానే బిజినెస్ జరుగుతుంది. యాక్టింగ్‌కు టెంపరరీ బ్రేక్ ఇచ్చిన ఆర్పీ.. బ్రాంచ్‌లు పెంచే పనిలో పడ్డాడు. అంతా బానే ఉంది కానీ అక్కడ ధరలు ఎంత ఉన్నాయి విషయంపై చాలామందికి క్లారిటీ లేదు. ఇంత ప్రమోట్ చేస్తున్నారు.. నోరూరిస్తున్నారు.. అసలు ధరలు ఎలా ఉన్నాయి అనే డౌట్ కొందరి నుంచి వస్తున్నాయి. దానిపై తాజాగా మేము ఎంక్వైరీ చేశాం. ఆ వివరాలు మీ కోసం
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి