మీడియా రంగంలో టాప్ ప్లేసులో దూసుకుపోతున్న టీవీ9 వివిధ రకాల కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని వ్యూయర్స్‌కి పరిచయం చేస్తూ నూతన ప్రోగ్రామ్స్‌ను మొదలుపెడుతూ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలోనే ప్రేక్షకులు నుంచి ఆదరణ పొందుతోంది.
న్యూస్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుని.. తెలుగు రాష్ట్రాల్లో అగ్రస్థానంలో కొనసాగుతూనే.. తెలుగు భాషతో పాటు వివిధ భాషల్లో కూడా కొత్త ఛానల్స్ ద్వారా వార్తా ప్రసారాలను చేస్తోంది. ఇదిలా ఉంటే తెలుగు మీడియా రంగంలో ఎదురులేని శక్తిగా అవతరించిన టీవీ9 ప్రోగ్రామ్స్‌పై ఓ లుక్కేద్దాం..
ప్రతీ రోజూ ఉదయం 8.25 నిమిషాలకు ఈ లోకల్ టూ గ్లోబల్ (Local To Global) కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దేశంలోని వివిధ నగరాలకు సంబంధించిన వార్తలు, ప్రపంచం నలుమూల్లో జరిగిన ప్రధాన అంశాలను ఫటాఫట్‌గా అందిస్తారు.
ప్రతీ రోజూ రాత్రి 8 గంటలకు ఈ సూపర్ ప్రైమ్ టైం(Super Prime Time) కార్యక్రమం ప్రసారమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రధాన అంశాలను ఒకే వేదికపై ప్రేక్షకులకు అందించేది ఈ సూపర్ ప్రైమ్ టైం ప్రోగ్రాం.
కరెంట్ అఫైర్స్, దేశవ్యాప్తంగా వివిధ అంశాలకు సంబంధించి రాజకీయ నిపుణులతో చర్చా వేదిక.. సమకాలిక అంశాలపై నిష్ణాతులైన నిపుణులతో చర్చించి ప్రజలకు ఏది అవసరం.. ఏది అనవసరం అని వివరించేది ఈ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్(Big News Big Debate) కార్యక్రమం. ఈ ప్రోగ్రాం ప్రతీ రోజూ రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది.
ఏరోజుకు ఆ రోజు చర్చనీయాంశమైన ప్రధాన విషయాలపై సమగ్రత సమాచారం అందించడమే బర్నింగ్ టాపిక్ కార్యక్రమం. ఇందులో వార్తలపై పూర్తి విశ్లేషణాత్మక కథనాలను ప్రేక్షకులకు అందిస్తుంది. ఈ కార్యక్రమం ప్రతీ రోజూ ఉదయం 7.25 నిమిషాలకు ప్రసారం అవుతుంది.
రాజకీయ, క్రీడా, సినీ రంగానికి సంబంధించిన ప్రధాన అంశాలను క్లుప్తంగా ప్రేక్షకులకు అందించడమే ఈ టాప్ న్యూస్ 9 కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రోగ్రాం ప్రతీ రోజూ ఉదయం 6. 55 నిమిషాలకు మళ్లీ తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది.
ఏరోజుకు ఆ రోజు జరిగే ప్రధాన అంశాలపై సమగ్ర చర్చ జరపడమే ఫ్లాష్ పాయింట్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమం ప్రతీ రోజూ సాయంత్రం 5 గంటలకు ప్రసారం అవుతుంది.
టీవీ9 నూతనంగా ప్రారంభించిన సరికొత్త సెటైరికల్ ప్రొగ్రామ్ ‘ఇస్మార్ట్ న్యూస్’. అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేసే కార్యక్రమం ఇస్మార్ట్ న్యూస్. కరెంట్ ఇష్యూను తీసుకుని తమదైన శైలిలో మూడు ప్రాంతాల యాస, భాషలతో కూడిన సమాహారమే ఈ ఇస్మార్ట్ న్యూస్ కార్యక్రమం. కథలు, సామెతలతో ప్రేక్షకులను అలరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.