Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రహదారులు జలమయం.. జీహెచ్‌ఎంసీ హెచ్చరికలు

వానొస్తది.. వరదొస్తది.. ప్రతి సీజన్‌లో ఇది కామనే.. కానీ వాన వచ్చిన ప్రతిసారీ.. హైదరాబాద్ అష్టకష్టాలు పడుతోంది. కాలనీలు మునుగుతున్నాయ్.

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రహదారులు జలమయం.. జీహెచ్‌ఎంసీ హెచ్చరికలు
Hyderabad Rains

Updated on: Oct 16, 2021 | 5:58 PM

వానొస్తది.. వరదొస్తది.. ప్రతి సీజన్‌లో ఇది కామనే.. కానీ వాన వచ్చిన ప్రతిసారీ.. హైదరాబాద్ అష్టకష్టాలు పడుతోంది. కాలనీలు మునుగుతున్నాయ్.. ప్రమాదాలు జరుగుతున్నాయ్.. రాను రాను నగరంలో ఉండాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హైదరాబాద్ మహా నగరాన్ని మరోసారి.. భారీ వర్షం ముంచెత్తింది. చాలా చోట్ల భారీ వర్షం పడుతోంది. మధ్యాహ్నం నుంచి వర్షం పడుతూనే ఉంది. చాలా చోట్ల వర్షపు నీటితో రోడ్లన్నీ మునిగిపోయాయి. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎల్బీనగర్, దిల్‌షుఖ్‌ నగర్.. సహా అన్ని ఏరియాల్లో వాన దండికొడుతోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది.

ఎల్బీనగర్‌‌లో చెరువులను తలపించేలా నీళ్లు రోడ్డుపై ప్రయాణిస్తున్నాయి. బైక్‌లు కొట్టుకుని పోతున్నాయి. కార్లు, బస్సులు కూడా వెళ్లలేని పరిస్థితి ఎల్బీనగర్‌లో ఉంది.  రామంతపూర్‌లో ప్రమాదం తప్పింది. రోడ్డుపై గుంతను తవ్వి వదిలేశారు సిబ్బంది. ఆ గుంతలోనే బైక్‌తో సహా పడిపోయారు ఓ యువకుడు. వెంటనే పైకి లేచి ప్రమాదం నుంచి బయటపడ్డారు.

రాజేంద్రనగర్‌లో ఏదైనా వాగు ప్రవహిస్తుందా.. అనేంతగా వరద వస్తోంది. కాలనీల్లో భారీ ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్నాయి. నాళాలు ఉప్పొంగుతున్నాయి. అంబర్‌పేట్‌, రాజేంద్రనగర్‌, ఎల్బీ నగర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అత్తాపూర్‌లోనూ భారీ వర్షం కురుస్తోంది. కాటేదాన్‌, శివరాంపల్లి, బండ్లగూడలోనూ వర్షం పడుతోంది. మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌లో వరద బీభత్సం సృష్టించింది. చాలా చోట్ల రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. భారీ వర్షానికి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద .. మోకాళ్ల లోతు నీళ్లు పారుతున్నాయి. అంబర్ పేటలోనూ భారీ వర్షం కురిసింది. కాలనీలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.

Also Read: పండుగ తర్వాత భారీ విద్యుత్ కోతలంటూ ఏపీలో ప్రచారం.. ఇందన శాఖ క్లారిటీ

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన.. రాబోయే 3 రోజులు ఇలా